SS Rajamouli : ఆ హీరోయిన్‌ తో రొమాన్స్‌..గోడలు దూకి మరీ వెళ్లాడట ?

SS Rajamouli Fall In Love With A Heroine

SS Rajamouli :  టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో చాలామంది దర్శకులు ఉన్నప్పటికీ… మన జక్కన్న కు ఉన్న క్రేజ్ మరే దర్శకుడికి లేదన్న మాట వాస్తవం. ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ బంపర్ హిట్ చేసుకున్న ఏకైక దర్శకుడిగా ఎస్ ఎస్ రాజమౌళి రికార్డు సృష్టించాడు. తెలుగు సినీ రచయిత కె.వి విజయేంద్ర ప్రసాద్ గారి సంతానం మన ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి కర్ణాటకలో జన్మించినప్పటికీ.. హైదరాబాదులో సెటిల్ అయ్యారు.

ఈటీవీలో కొన్ని సీరియల్స్ కు దర్శకత్వం వహించిన జక్కన్న… జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేసి దర్శకుడిగా అవతారం ఎత్తారు. ఆ తర్వాత సింహాద్రి సినిమాతో మరో హిట్ అందుకున్న జక్కన్న… చత్రపతి, సై, బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ ఇలాంటి ఎన్నో సినిమాలు చేసి… చరిత్ర సృష్టించారు రాజమౌళి. లేటెస్ట్ గా చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ లెవెల్ లో క్రీజ్ సంపాదించుకున్నాడు ఎస్ ఎస్ రాజమౌళి. అయితే అలాంటి స్టార్ దర్శకులు రాజమౌళి ( SS Rajamouli  ) గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోని ఓ హీరోయిన్ కోసం… మన జక్కన్న చాలా ప్రయత్నాలు చేశాడట. ఆమెను గాఢంగా ప్రేమించిన రాజమౌళి… ఆమె కోసం గోడలు కూడా దూకేవాడట. అసలు వివరాల్లోకి వెళితే… జక్కన్న భార్య రమ ను పెళ్లి చేసుకోక ముందు… ఓ హీరోయిన్ ను గాఢంగా దర్శకుడు రాజమౌళి ప్రేమించారట. ఎలాగైనా ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట జక్కన్న. అయితే ఈ ప్రేమ వన్ సైడ్ లవ్ కావడంతో జక్కన్నకు నిరాశ మిగిలిందట.

కానీ ఆమెను ఒప్పించేందుకు మరియు ఆమెతో మాట్లాడేందుకు చాలాసార్లు ఆ హీరోయిన్ ఇంటి గోడలు కూడా ఎక్కాడట జక్కన్న. ఈ విషయం రాజమౌళి సన్నిహితుల ద్వారా బయటకు వచ్చింది. కాగా… మొదటి ప్రేమ విఫలం కావడంతో రమాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దర్శకుడు రాజమౌళి. రమాకు అది వరకే పెళ్లి అయినప్పటికీ… ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దర్శకుడు రాజమౌళి. కాగా కార్తికేయ…. రమాదేవి మొదటి భర్త కొడుకు అన్న సంగతి తెలిసిందే.