Times Now Navbharat Survey on parliment elections
Times Now Navbharat Survey : మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 2024 ఏప్రిల్ లేదా మే మాసంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు మరియు అధికార వైసిపి పార్టీ ఇప్పటినుంచే ప్రచారాలు మొదలుపెట్టేసాయి.
ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ఒక అడుగు ముందుగానే… ఏపీ ప్రజల్లోకి చొచ్చుకుని పోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… వారాహి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అటు జిల్లాల వారిగా నారా చంద్రబాబునాయుడు పర్యటిస్తూ ముందుకు పోతున్నారు. ఇక అధికార వైసిపి పార్టీ… ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేస్తూ… జగనన్న సురక్ష మరియు గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాలతో నిత్యం జనాల్లో ఉంటోంది.
ఇలాంటి తరుణంలో తాజాగా ఓ సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే ఫలితాలు… ఏపీ రాజకీయాలను కుదుపేస్తున్నాయి. టైమ్స్ నౌ నవభారత్ అనే సర్వే సంస్థ తాజాగా పార్లమెంటు ఎన్నికలపై సర్వే నిర్వహించింది. ఏ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపుతోందని దానిపై… టైమ్స్ నౌ నవభారత్ తన సర్వేను నిర్వహించింది. జన్ గన్ కా మన్ పేరుతో ఈ సర్వే నిర్వహించింది టైమ్స్ నౌ నవభారత్. అయితే వీరి సర్వే రిపోర్టులో… ఏపీలోని అధికార వైసిపి పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి.
ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరిగితే 25 ఎంపీ స్థానాలకు గాను 24 లేదా 25 సీట్లు వస్తాయని ఈ సర్వే తేల్చి చెప్పేసింది. అలాగే దేశంలోనే అతి పెద్ద పార్టీగా వైసిపి అవతరించబోతుందని కూడా ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు రావడం కూడా చాలా కష్టమని తేల్చి చెప్పింది ఈ సర్వే సంస్థ. ఇక జనసేన, బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీలకు ఏపీలో అడ్రస్ గల్లంతయ్యి అవకాశం ఉన్నట్టు ఈ సర్వే సంస్థ చెప్పింది. దీంతో వైసిపి కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు.