God idols: విరిగిపోయిన విగ్రహాలను అలాగే దేవుడి గదిలో పెడుతున్నారా.. అయితే అరిష్టమే..!!

God idols

God idols:Do you keep broken idols in gods room but it is inauspicious

God idols: ప్రతి ఒక్కరి ఇంట్లో దేవుడి గది ఉంటుంది. ఆ దేవుడి గదిలో వివిధ దేవుళ్లకు సంబంధించిన ఫోటోలు, విగ్రహాలు ఉంటాయి.అయితే మరీ ముఖ్యంగా దేవుడి గదిలో ఉండే ఫోటోలు,విగ్రహాలు విరిగిపోయినా లేదా పగిలిపోయినా ఇంట్లో ఉంచుకోవడం మంచిదా కాదా అనేది చాలామందికి అనుమానం ఉంటుంది.మరి ఇంట్లో పగిలిపోయిన దేవుడి విగ్రహాలు ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

God idols

ఎప్పుడూ కూడా దేవుడి గదిలో పగిలిపోయిన లేదా విరిగిపోయిన దేవుడి ఫోటోలు విగ్రహాలను ఉంచుకోకూడదు.ఇలా ఉంచుకోవడం వల్ల పగిలిపోయిన విరిగిపోయిన విగ్రహాలను తొందరగా నెగిటివ్ శక్తి ఆకర్షిస్తుంది. దాంతో ఇంట్లో కలహాలు,గొడవలు వంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇక కొంతమంది ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న విగ్రహాలు కాస్త విరిగిపోతే కొంచమే కదా డ్యామేజ్ అయింది అని వాటిని మళ్లీ అతికించి దేవుడి గదిలో పెట్టి పూజిస్తూ ఉంటారు.

కానీ అలా పూజించడం ఏమాత్రం సరి కాదట. ఇలా చేయడం అశుభం అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఎన్ని డబ్బులు పెట్టి ఖరీదైన విగ్రహాలు కొన్నా కూడా చిన్నగా విరిగినా కూడా ఆ విగ్రహాలను తొందరగా ఇంట్లో నుండి తీసేయాలి. లేకపోతే ఇంట్లో అశుభం చూడాల్సి వస్తుందట. అంతేకాకుండా విరిగిపోయిన లేదా పగిలిపోయిన విగ్రహాలను మన దగ్గరలో ఉండే ఆలయంలో పెట్టి రావాలి.ఆ విగ్రహాలను ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకోకపోవడం మంచిది.

కొంతమంది ఇంట్లో ఉండే విగ్రహాలు పగిలిపోతే వాటి స్థానంలో వేరే విగ్రహాలు పెట్టడానికి శాస్త్రోక్తంగా అన్ని కార్యక్రమాలు పూజలు చేసి పెడతారు. కానీ అది పెద్ద పెద్ద ఇళ్లలో ఉండే వాళ్ళే చేస్తారు. కానీ సాధారణ జనాలు ఆఫోటోలు మాత్రమే తీసేస్తారు. అయితే ఏ దేవుడి విగ్రహం అయితే పగిలిపోతుందో ఆ దేవుడి విగ్రహం స్థానంలో మరొక కొత్త దేవుడు విగ్రహాన్ని పెట్టడం చాలా మంచిది అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.