Niharika Konidela getting second marriage
Niharika Konidela : మెగాస్టార్ కుటుంబంలో ఎంతోమంది హీరోలు అలాగే నటీనటులు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కారణంగా చాలామంది ఇండస్ట్రీకి పరిచయమై… ఇప్పుడు ఆగ్ర హీరోలుగా కూడా కొనసాగుతున్నారు. ఇక మెగా కుటుంబంలో చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ఏకైక నటి కొనిదెల నిహారిక మాత్రమే. నాగబాబు కూతురు అయిన కొణిదెల నిహారిక.. నటిగా అలాగే యాంకర్ గా అటు హీరోయిన్గా కూడా తెలుగు పేక్షకులకు బాగా దగ్గరయింది.
ముద్దపప్పు ఆవకాయ, ఒక మనసు, సైరా నరసింహారెడ్డి మరియు సూర్యకాంతం లాంటి సినిమాలు చేసి నాగబాబు కుమార్తె నిహారిక బాగా పాపులర్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మెగా డాటర్ నిహారిక… గత రెండేళ్ల కిందట.. ప్రముఖ పోలీస్ ఆఫీసర్ కొడుకు వెంకట చైతన్య ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు వీరిద్దరూ రెండేళ్ల పాటు తమ దాంపత్య జీవితాన్ని…. చాలా ఆనందంగా మరియు ఉత్సాహంగా గడిపారు.
అయితే గత ఆరు నెలలుగా… కొణిదెల నిహారిక మరియు వెంకట చైతన్య మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. నిహారిక ప్రవర్తన నచ్చకపోవడంతో… ఆమెకు ఆమె దూరంలో ఉంటున్నాడు వెంకట చైతన్య. అంతేకాదు నిహారిక ఫోటోలను తన సోషల్ మీడియా లో నుంచి కూడా డిలీట్ చేశాడు వెంకట చైతన్య. ఇటు నిహారిక కూడా వెంకట చైతన్య ఫోటోలను డిలీట్ చేసి… విడాకులకు సిద్ధమవుతున్నట్లు చెప్పకనే చెప్పింది.
అయితే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ….దీనికి అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ యూట్యూబర్ తో కొనిదెల నిహారిక… చాలా క్లోజ్ గా ఉంటుందని… అది గమనించిన వెంకటచైతన్య ఆమెకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వరుణ్ తేజ్ వివాహం జరిగిన తర్వాత యూట్యూబర్ ను కొనిదల నిహారిక పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా తాజాగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను మాత్రం మెగా ఫాన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు.