Raghunandhan rao comments on Bandi Sanjay
Bandi Sanjay : గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర బిజెపిలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీలో అసంతృప్తులు భారీగా పెరిగిపోతున్నారు. మొదట్లో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు అధిష్టానం పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక నిన్నటి నుంచి దుబ్బాక బిజెపి పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెరపైకి వచ్చారు.
గత కొన్ని రోజులుగా తనకు ఎలాంటి పదవులు ఇవ్వడం లేదని విషయాన్ని ఉటంకిస్తూ… తెలంగాణ బిజెపి అధిష్టానం అలాగే కేంద్ర బిజెపిపై ఫైర్ అయ్యారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. నిన్న ఢిల్లీకి వెళ్లిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు… కొంతమంది మీడియా మిత్రులతో మాట్లాడుతూ… బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay ) అలాగే నడ్డాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ పదవిని ఇంకా నియమించలేదని… నడ్డాను అడిగితే… దానిపై వ్యంగ్యంగా ఆయన స్పందించినట్లు రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
బిజెపి చీఫ్ నడ్డాపై ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేస్తానని కూడా రఘునందన్ రావు పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. ఇక తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పై కూడా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎంపీగా నిలబడ్డప్పుడు బండి సంజయ్ దగ్గర అసలు డబ్బులు లేవని… భార్య పుస్తలు తాకట్టు పెట్టి మరి ఎంపీగా గెలిచారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు బండి సంజయ్ కుమార్ దగ్గర 100 కోట్లు ఎక్కడి వంటి ప్రశ్నించారు రఘునందన్ రావు.
భారీగా డబ్బులు సంపాదించుకొని పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చే స్థాయికి బండి సంజయ్ ఎదిగినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రఘునందన్ చేసిన వ్యాఖ్యలు మీడియా ఛానల్లో బ్రేకింగ్ ల మీద బ్రేకింగ్ లు రావడంతో… రఘునందన్ రావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు. తాను ఏదో సరదాగా చేసిన వ్యాఖ్యలను బ్రేకింగ్ వార్తల్లో వేయడం ఏంటని విచిత్రంగా మీడియా ఫై విరుచుకుపడ్డాడు రఘునందన్ రావు. అయితే రఘునందన్ రావు చేసిన ఆరోపణలు వాస్తవమేనని సాటి బిజెపి నాయకులు కూడా ఇప్పుడు చెప్పడం గమనార్హం. రఘునందన్ రావు ఢిల్లీలో చెప్పిన మాటలన్నీ వాస్తవమేనని.. మొదట బండి సంజయ్ కుమార్ ను తప్పిస్తే తప్ప బిజెపి పార్టీ ఎదగదని కొంతమంది బిజెపి వాదులు చెబుతున్నారు.