Samantha: విడాకులు తీసుకున్నా మెడలో నల్లపూసలు ధరిస్తున్న సమంత.. కారణం అదేనా..?

Samantha

Samantha is wearing black beads around her neck.. Is that the reason..?

Samantha: హిందూ సంప్రదాయంలో మంగళసూత్రంకు ఎంతో ప్రాధాన్యత ఉందనే సంగతి తెలిసిందే. పెళ్లి అయిందనే ప్రూఫ్ మంగళసూత్రమే. పెళ్లయిన అమ్మాయి మెడలో మంగళసూత్రం కచ్చితంగా ఉండాల్సిందే. అయితే కొందరు పసుపుతాడు, మరికొందరు బంగారంతో మంగళ సూత్రాన్ని ధరిస్తారు. ఈ రెండు వారి మెడలో పెద్దగా కనిపిస్తాయి. అందుకే హీరోయిన్లు నల్లపూసలతో కలిపి ఉన్న మంగళసూత్రాన్ని ధరిస్తూ ఉంటారు.

ఇవి పెద్దగా బరువు లేకుండా సింపుల్ గా ఉంటాయి కాబట్టి వాటిని ధరిస్తారు. ఇక స్టార్ హీరోయిన్లు ఒక్కొక్కరు ఒక్కో డిజైన్ లో ఉండే మంగళసూత్రాన్ని ధరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మెడలో ధరించిన నల్లపూసల దండ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఈమె టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య తో విడిపోయిన విషయం తెలిసిందే.

అయితే విడాకుల అనంతరం కొంతకాలం సినిమాలకు గ్యాప్ తీసుకొని మళ్లీ వరుస సినిమాలతో దూసుకుపోతోంది సమంత. ఈ ముద్దుగుమ్మ తాజాగా మెడలో నల్లపూస దండ వేసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసినవారు ఆమె రెండో పెళ్లి చేసుకుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆమె ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ మూవీ షూటింగ్ లో భాగంగానే ఆ నల్లపూసల దండ వేసుకుందని అంటున్నారు. ఏది ఏమైనా గత కొద్ది రోజులుగా సమంత రెండవ పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ రూమర్స్ కి సమంత చెక్ పెడుతుందా..? లేక తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుందా..? అనేది వేచి చూడాలి.