Earlier VidyaBalan used to beg in Star Hotel
VidyaBalan: నాలుగు పదుల వయసు దాటినా కూడా తన గ్లామర్ తో వరుస సినిమాలు చేస్తోంది బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్. 44 ఏళ్ల వయసులో ఈమె చేసే గ్లామర్ షో మామూలుగా ఉండదు. 2005లో వచ్చిన పరిణీత అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విద్యాబాలన్.. సిల్క్ స్మిత జీవిత కథతో రూపొందిన డర్టీ పిక్చర్ సినిమా ఆమె సినీ కెరీర్ ని మలుపు తిప్పింది. అప్పటినుండి వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది.
కళ్ళతోనే మత్తెక్కించగల అందం ఈమె సొంతం. కెరీర్ మొదటి నుండి బోల్డ్ పాత్రలనే ఎంచుకుంటూ వస్తుంది విద్యాబాలన్. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరుపొందింది. ఈమె తన నటనతో నేషనల్ అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకుంది. తెలుగులో నందమూరి బాలకృష్ణతో కూడా విద్యాబాలన్ జతకట్టింది. ఇంత గుర్తింపు ఉండి, ఎన్నో కోట్లు సంపాదించిన విద్యాబాలన్ ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో అడుక్కుందట.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఆమె ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. “ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ ఘటన జరిగింది. నేను ఇండియన్ మ్యూజిక్ గ్రూప్ లో మెంబెర్ గా ఉండేదాన్ని. ఆ సంస్థ ప్రతి ఏడాది మూడు రోజులపాటు మ్యూజిక్ కార్యక్రమాలను నిర్వహిస్తుండేది. ఆ కార్యక్రమాలు అన్ని రాత్రుల్లు జరిగేవి. నేను అందులో వాలంటీర్ గా పనిచేసేదాన్ని. అలా ప్రోగ్రామ్స్ అయిపోయాక నేను మా స్నేహితులతో కలిసి వాకింగ్ కి వెళ్ళేదాన్ని.
అలా ఓ రోజు మేము వాకింగ్ కి వెళ్ళినప్పుడు నా స్నేహితురాలు ఒకరు దగ్గరలోని స్టార్ హోటల్ కి వెళ్లి తినడానికి ఏదైనా ఇవ్వాలంటూ అడుక్కోవాలని నాతో చాలెంజ్ చేసింది. నేను ఆ చాలెంజ్ ని స్వీకరించాను. వెంటనే ఆ దగ్గరలో ఉన్న ఓ స్టార్ హోటల్ కి వెళ్లి అక్కడ ఉన్న డోర్ దగ్గర నిల్చొని.. నిన్నటి నుండి ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉందని అడుక్కున్నాను. వారు నా వైపు వింతగా చూశారు. ఇది గమనించిన నా స్నేహితులు వద్దులే వచ్చెయ్ అని అన్నారు. కానీ నేను బెట్ గెలవాలని వారు పిలిచినా కూడా పట్టించుకోలేదు. అప్డేట్ లో గెలిచి నేను బిస్కెట్లను గిఫ్ట్ గా పొందాను” అని చెప్పుకొచ్చింది.