Kajol: బలవంతపెట్టినా వాళ్లు నా సినిమాలు చూడరు..!

Kajol

Kajol: They won’t watch my movies even if I force them..!

Kajol: నిన్నటి తరం కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్, బాలీవుడ్ బ్యూటీ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె పేరు చెబితే దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమానే గుర్తొస్తుంది. అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలుస్తుంది కాజోల్. గతంలో చాలా ఏళ్లపాటు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. కాజోల్ దాదాపు స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది.

ఈమె నటించిన కొన్ని సినిమాలు బాలీవుడ్ లో ఆల్ టైం హిట్లుగా నిలిచాయి. ఇక మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఈ బాలీవుడ్ నటి ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో జోరుమీదుంది. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్, ఓటీటీ ఫిలిమ్స్ చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా కాజల్ “లస్ట్ స్టోరీస్ 2” లో నటించింది. ఇదే కాకుండా మరికొద్ది రోజుల్లో “ది గుడ్ వైఫ్” అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది.

ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ” నేను నా కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలు పోషించాను. అయితే నిజ జీవితంలో తల్లిగా ఉండడానికి.. తెరపై తల్లి పాత్రలో నటించడానికి చాలా తేడా ఉంటుంది. తెరపై తల్లి కూతుర్ల అనుబంధం మరింత సహజంగా కనిపించేలా నటించడానికి నేను 100% ప్రయత్నిస్తాను. నా పిల్లలకు నాలో నచ్చని గుణాలు ఉండి ఉండొచ్చు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నా పిల్లలు నా సినిమాలను చూడరు. నేను ఎంత బలవంత పెట్టినా వారు చూడమని అంటారు. మా బంధువులలో కూడా కొంతమంది నా సినిమాలను చూడరు. ఎందుకంటే నేను ఏడుపు సన్నివేశాలలో నటించడం వాళ్ళు చూడలేరట. నువ్వు తెరపై ఏడుస్తూ కనిపిస్తే మాకు ఏడుపు వస్తుందని.. అందుకే నీ సినిమాలు చూడకూడదనుకున్నామని చెప్పారట. అది తనకు గొప్ప ప్రశంసలా అనిపించింది” అంటూ చెప్పుకొచ్చింది కాజోల్.