Sadha : మొగుడి కన్నా పశువులే నయం..పెళ్లి చేసుకుంటే విడాకులే !

Sadha
Sadha

Sadha comments on Marriage

Sadha : మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో… ఇప్పటివరకు పెళ్లి కానీ టాప్ హీరోయిన్లు పదుల సంఖ్యలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. వయసు 40 ఏళ్లు దాటిన పెళ్లి చేసుకుని టాలీవుడ్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలా 40 సంవత్సరాలు వచ్చినప్పటికీ… పెళ్లి ముచ్చట ఎత్తని హీరోయిన్ల లిస్టులో సదా కూడా ఒకరు. హీరోయిన్ సదా ( Sadha )… ఈ పేరు చెప్పగానే అందరికీ జయం సినిమా మాత్రమే గుర్తుకువస్తుంది. వెళ్ళవయ్యా వెళ్ళు… వెళ్ళు అంటూ జయం సినిమాలో హీరో నితిన్ సరసన నటించి అదరగొట్టింది హీరోయిన్ సదా.

2002 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా… హీరో నితిన్ కు అలాగే హీరోయిన్ సదాకు మంచి క్రేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఈ ఇద్దరు హీరో హీరోయిన్లు… టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దూసుకుపోయారన్నమాట వాస్తవం. ఇది ఇలా ఉండగా… హీరోయిన్ సదా 19 84 సంవత్సరంలో పుట్టిందట. అంటే ఇప్పటివరకు హీరోయిన్ సదా ఏజ్ 39 సంవత్సరాలు దాటిపోయింది. నేను ఇప్పటికీ పెళ్లి మాట అస్సలు ఎత్తడం లేదు ఈ బ్యూటీ.

Sadha
Sadha

ఈటీవీలో ప్రసారమయ్యే డి, ఇప్పుడు స్టార్ మా లో ప్రసారమయ్యే డాన్స్ ప్రోగ్రామ్లలో… జడ్జిగా కొనసాగుతోంది హీరోయిన్ సదా. అయితే తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది ఈ బ్యూటీ. పెళ్లి ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారు… ఇంకా ఎన్నిరోజులు ఇలా ఒంటరిగా ఉంటామని అడుగుతున్నారని సదా పేర్కొంది. అయితే పెళ్లి చేసుకోకుండానే తాను చాలా హ్యాపీగా ఉన్నానని… పెళ్లి చేసుకుంటే తన పార్ట్నర్ అనేక ఆంక్షలు పెట్టే అవకాశం ఉందని తెలిపింది.

ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా నేను… ఏ అడివిలోకైనా వెళ్తాను… అక్కడ జంతువులను చూసి చాలా ఆనంద పడతాను… మనుషులకంటే జంతువులే నయం అంటూ వ్యాఖ్యానించింది సదా. తనకు పెళ్లి అంటే అసలు ఇంట్రెస్ట్ లేనట్టుగా తెలిసి చెప్పింది హీరోయిన్ సదా. అలాగే పెళ్లి చేసుకుంటే విడాకులు అయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. అందుకే తాను పెళ్లి చేసుకోవడం లేదని కుండబద్దలు కొట్టి చెప్పింది హీరోయిన్ సదా.