Salaar : రెండు పార్ట్ లుగా `సలార్‌`.. `కేజీఎఫ్‌` తరహాలోనే ఉంటుందా ?

prabhas
prabhas

Salaar movie in two parts

Salaar :  టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ మధ్యకాలంలో ఏడాదికి మూడు సినిమాలు లేదా రెండు సినిమాలు చొప్పున చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. బాహుబలి సినిమా రిలీజ్ తర్వాత తన క్రేజ్ పెంచుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు వరుస సినిమాలకు దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవల ఆది పురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… తర్వాత సలార్ ( Salaar  ) అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. కే జి ఎఫ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీ ల్ … సలార్ సినిమాను కూడా అదే రీతిలో తెరకెక్కించి బంపర్ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా… రవి బస్సు రూర్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇక ఎప్పటినుంచో ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అందరూ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

prabhas
prabhas

ఈ తరుణంలోనే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేసి అందర్నీ ఎంటర్టైన్ చేసింది సలార్ టీం. ఇవాళ ఉదయం ఐదు గంటల 12 నిమిషాల ప్రాంతంలో ఈ సినిమా టీజర్ ను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. ఇందులో ప్రభాస్ ను చాలా పవర్ ఫుల్ హీరోగా చూపించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ మాస్ లుక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఫైట్స్ అలాగే సీన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని అందరు అంటున్నారు.

అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాపై ఓ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. టీజర్ లో పార్ట్ వన్ cease-fire అంటూ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ హింట్ తో సలార్ పార్టీ 2 కూడా ఉన్నట్లు అందరూ అనుకుంటున్నారు. అంటే కేజీఎఫ్ సినిమా తరహాలోనే రెండు భాగాల్లో ఈ సినిమా రానుందన్న మాట. కాగా ఈ సినిమా పార్ట్ వన్ ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.