Some interesting things that none of you noticed in Salaar teaser..!
Salaar teaser: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ” సలార్”. ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.
ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోందని టీజర్ తోనే మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ టీజర్ లో ప్రభాస్ ని క్లోజ్ అప్ షాట్స్ లో చూపించకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. 1:46 సెకండ్స్ ఉన్న ఈ టీజర్ లో ప్రభాస్ ముఖం ఎక్కడా పూర్తిగా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. అయితే ఈ టీజర్ ఇంట్రడక్షన్ గురించి ఇంగ్లీష్ లో ఉండడం మీరు గమనించారా..?
సరిగ్గా కేజీఎఫ్ చాప్టర్ 2 లోను ఇదేవిధంగా ఇంగ్లీష్ డైలాగ్ తో హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలోనూ ఇంగ్లీష్ లో హీరో ఇంట్రడక్షన్ చెప్పించారు. ఈ పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పే ఆయన ఎవరో కాదు.. గతేడాది ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన అనుపమ్ ఖేర్. సలార్ లో కూడా ఆయన ఓ గొప్ప పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కింద క్యాప్షన్ గా.. “పార్ట్ 1 సీజ్ ఫైర్” అని పెట్టారు. అంటే రెండు సమూహాల మధ్య యుద్ధాన్ని శాశ్వతంగా ఆపడమే. సీజ్ ఫైర్ అనేది యుద్ధ సమయంలో శాంతి కోసం కుదుర్చుకునే ఒక ఒప్పందం లాంటిది. కేజిఎఫ్ రెండు భాగాలలాగే సలార్ కూడా రెండు భాగాలలో రాబోతోంది. అయితే 2 పార్ట్ చూసే అవకాశం ఇప్పుడప్పుడే అభిమానులకు ఉండదు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేతిలో మరో నాలుగు సినిమాలు ఉన్నాయి.