Comedian Satya: సినిమాల్లోకి రాకముందు కమెడియన్ సత్య అలాంటి పనులు చేసేవాడా..?

comedian Satya

Did comedian Satya do such things before entering films?

comedian Satya: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉండే ప్రతి నటీ నటులకు ఏదో ఒక సొంత టాలెంట్ ఉండే ఉంటుంది. అయితే వారిలోని ఆ టాలెంట్ ని బయటకి తీసినప్పుడే వారి సత్తా ఏంటో మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ లీడింగ్ కమెడియన్స్ లిస్టు తీస్తే అందులో కమెడియన్ సత్య పేరు ఖచ్చితంగా ఉంటుంది. పెద్దగా కంటెంట్ లేని సన్నివేశాలను కూడా తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో నవ్వు తెప్పించే కెపాసిటీ సత్యలో ఉంది.

స్వామి రారా, కార్తికేయ, చలో, రౌడీ ఫెలో, ఎక్కడికి పోతావు చిన్నవాడా, మత్తు వదలరా, రంగస్థలం, అందగాడు, గద్దల కొండ గణేష్, అర్జున్ సురవరం వంటి ఎన్నో సినిమాలలో నటించి కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సత్య. అంతేకాదు వివాహ భోజనంబు అనే సినిమాతో హీరోగా కూడా మారాడు. ఇక ప్రస్తుతం భోళాశంకర్, బెదురులంక సినిమాలో నటిస్తున్నాడు. ఇదే కాకుండా ఇటీవల రంగబలి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన పలువురు యాంకర్స్ ని ఇమిటేట్ చేసిన ఓ వీడియో ఓ రేంజ్ లో ట్రేండింగ్ గా మారింది.

అయితే ఇండస్ట్రీలో ఇంత స్టార్ కమెడియన్ గా మారిన సత్య కెరీర్ మొదట్లో హైదరాబాద్ కి వచ్చినప్పుడు సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడట. ఓవైపు సినిమాలలో ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు చేతికి దొరికిన ప్రతి పని చేస్తూ వచ్చాడు. అలా రోజూ అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరుగుతున్న ఇతనిని కమెడియన్ ధనరాజ్ గుర్తించాడు.

అప్పటికి ధనరాజ్ జబర్దస్త్ లో ఓ టీం లీడర్ గా కొనసాగుతున్నాడు. దీంతో ఇతడిని చూడగానే అతని ముహంలో ఓ వెటకారం కనిపించిందట. దీంతో మన టీమ్ లో అయితే ఇతడు బాగా పనికి వస్తాడని వెంటనే టీంలోకి తీసుకున్నారట. అలా జబర్దస్త్ లో చాలా కాలం పాటు కొనసాగిన సత్య ఆ తర్వాత మెల్లగా అవకాశాలు రావడంతో అంచలంచలుగా ఈ స్థాయికి ఎదిగాడు.