Sreeleela: అలాంటి పనులు చేసి అమ్మను మోసం చేసిన శ్రీలీల..!

Sreeleela

Sreeleela who cheated her mother by doing such things..!

Sreeleela: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగుతున్న హీరోయిన్ పేరు ఏదైనా ఉందంటే అది శ్రీలీలే. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్లి సందD సినిమాతో సినీ ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ మొదటి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది.

ఇక ఆ తరువాత మాస్ మహారాజా రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించి టాలీవుడ్ మొత్తాన్ని తన వెనుక తిప్పుకుంటుంది. ప్రస్తుతం 8 సినిమాలను చేతిలో పట్టుకొని స్టార్ హీరోయిన్లకు సైతం సవాల్ విసురుతుంది. ఇలా ఇండస్ట్రీలో బడా ప్రాజెక్టులలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న శ్రీలీల గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి మరో వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. చిన్నతనంలో ఎన్నో అబద్ధాలు చెబుతూ తన తల్లిని మోసం చేసిందట శ్రీలీల. ఎందుకంటే తన తల్లి ఆమెకు ఎన్నో కండిషన్లు పెట్టేదట. రోజంతా స్కూల్ కి వెళ్లి వచ్చిన తరువాత వెంటనే ట్యూషన్ కి పంపించేదట. ఆ ట్యూషన్ కి వెళ్లి వచ్చిన వెంటనే మళ్ళీ డాన్స్ స్కూల్, యాక్టింగ్ స్కూల్ కి పంపేదట.

దీంతో ఈ టార్చర్ భరించలేక కొన్నిసార్లు వీటి నుండి తప్పించుకోవడం కోసం దొంగ సాకులు చెబుతూ ఇంటి వద్దే ఉండేదట. కడుపునొప్పి అంటూ సాకులు చెబుతూ, లేదా జ్వరం వచ్చిందంటూ లేనిపోని కారణాలు చెబుతూ తన తల్లిని యేమార్చేదంటూ ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఇంత అల్లరిపిల్ల ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.