Pawan Kalyan : వాలంటీర్ల చేతిలో పవన్ కళ్యాణ్ బలి కావడం ఖాయమేనా ?

pawan kalyan
pawan kalyan

Pawan Kalyan comments on Volunteers

Pawan Kalyan :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. మన ఆదివారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రెండో విడత వారాహి యాత్రను ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ వారాహి యాత్ర నేపద్యంలో మరోసారి వివా దాస్పద వ్యాఖ్యలు చేసి.. ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్ల ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.

ఏపీలో దాదాపు 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని… అందులో కేవలం 15000 మంది మాత్రమే తిరిగి వచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ). అయితే దీనికి ఏపీలోని వాలంటీర్లే కారణం అన్నట్టుగా… వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ఏపీలో దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లను నియమించింది జగన్ సర్కార్. ఒకటో తారీకు రాగానే… ఏపీలోని పెన్షన్ దారులకు అలాగే రేషన్ కార్డుదారులకు అన్ని సదుపాయాలను ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు వాలంటీర్లు. పనిగట్టుకొని బ్యాంకులకు లేదా రేషన్ షాపులకు వెళ్లే పని లేకుండా వారే ఇంటింటికి వచ్చి జనాలకు ఇచ్చేస్తున్నారు.

pawan kalyan
pawan kalyan

అలాగే దాదాపు రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి వాలంటీర్లను.. నియమించి దేశానికి ఆదర్శంగా నిలిచింది జగన్ సర్కార్. వాలంటీర్లలను నియమించడం ద్వారా ఏపీలో నిరుద్యోగ రేటు కూడా కాస్త తగ్గింది. దీనికి ముఖ్య కారణం వాలంటీర్ల నియామకమే. అయితే అలాంటి వాలంటీర్ల వ్యవస్థను కించపరిచేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం వారికి అగ్రహాన్ని తెప్పించింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన మరునాడు అంటే నిన్న సోమవారం రోజున… పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి తమ నిరసనలు తెలిపారు వాలంటీర్లు.

ఏపీలో ఉన్నటువంటి వాలంటీర్లు అందరికీ పవన్ కళ్యాణ్ క్షమాపణం చెప్పే వరకు తమ నిరసనను ఆపబోమని స్పష్టం చేశారు. తాము ఏపీ ప్రజలకు మంచి సేవలు చేస్తున్నామని.. అలాంటివి తమపై ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదంటూ… వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వాలంటీర్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారట. వారు కూడా పవన్ కళ్యాణ్ ను… ఈ వ్యాఖ్యలను నేపథ్యంలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ చేతిలో పవన్ కళ్యాణ్ బలి కాబోతున్నాడని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అనవసరంగా వాలెంటర్ల వ్యవస్థను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచాడని చెబుతున్నారు.