Puri Jagannadh to launch YS Sharmila son as a hero
Ys Sharmila : వైయస్ షర్మిల ( Ys Sharmila )… దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల కూతురు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వైఎస్ షర్మిల… అనతి కాలంలోనే… పెద్ద పొలిటిషన్ గా మారిపోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలాగే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు… వైసిపి పార్టీకి అండగా నిలిచింది షర్మిల. వైసిపి పార్టీని గెలిపించేందుకు పాదయాత్ర కూడా చేసి.. సక్సెస్ అయింది షర్మిల.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వైఎస్ షర్మిల తరలివచ్చిందని అందరూ అంటూంటారు. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు వైఎస్ షర్మిల. తెలంగాణ వైసిపి పార్టీ పేరుతో ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు… కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తున్నాను షర్మిల.

అయితే తాజాగా కడప జిల్లాకు వెళ్లారు వైయస్సార్ బిడ్డ వైయస్ షర్మిల. వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా… ఇడుపులపాయలోని వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులు అర్పించారు షర్మిల కుటుంబ సభ్యులు. ఈ తరుణంలోనే వైయస్ షర్మిల కొడుకు రాజారెడ్డికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో షర్మిల కొడుకు రాజారెడ్డి సినిమాలోకి రాబోతున్నాడని… అందరూ ప్రచారం చేస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే… పూరి జగన్నాథ్ దర్శకత్వంలో షర్మిల కొడుకు రాజారెడ్డి తెలుగు హీరోగా పరిచయం కాబోతున్నాడని… నిన్నటి నుంచి ప్రచారం సాగుతోంది. అంతే కాదు… ఫుల్ మాస్ బ్యాక్ డ్రాప్ లో… పూరి జగన్నాథ్ మరియు రాజారెడ్డి కాంబినేషన్లో సినిమా రాబోతుందని అందరూ అంటున్నారు. అయితే ఈ వార్తలు ఎంత నిజం ఉందో ఏ ఒక్కరికి తెలియదు. దీనిపై క్లారిటీ రావాలంటే… టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ లేదా వైఎస్ షర్మిల ఎవరు ఒకరు స్పందించాలి.