Ranveer – Deepika: భార్యతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన రణవీర్ సింగ్..!

Ranveer - Deepika

Ranveer – Deepika: Ranveer Singh gave clarity on divorce with his wife..!

Ranveer – Deepika: బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణవీర్ సింగ్ – దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గోలియోన్ కి రాస్లిలా రామ్ లీలా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట ఆరేళ్లపాటు డేటింగ్ చేసి 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలం బాగానే ఉన్న వీరి దాంపత్య జీవితంలో మనస్పర్ధలు నెలకొన్నాయని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ రూమర్స్ రావడం మొదలయ్యాయి.

ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు ఈ జంట విడిపోతున్నట్లు బీ టౌన్ లో రూమర్స్ వినిపించాయి. కానీ ఎప్పటికప్పుడు వీటిని వారిద్దరూ కొట్టిపారేస్తూ వచ్చారు. తామిద్దరం సంతోషంగానే ఉన్నామంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. కానీ గత కొద్ది రోజులుగా వీరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ మళ్ళీ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇందుకు కారణం ఏంటంటే.. ఇటీవల రణవీర్ సింగ్ పుట్టినరోజు జరిగిన సంగతి తెలిసిందే.

అయితే ఈ బర్త్ డే పార్టీ తర్వాత వీరిద్దరి విడాకుల వార్త మరోసారి వైరల్ అయింది. ఇందుకు గల కారణం రణవీర్ కి సోషల్ మీడియా వేదికగా దీపిక విషెస్ తెలియజేయలేదు. దీంతో విడాకులకు సిద్ధమయ్యారంటూ మళ్లీ రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఇక వీటన్నింటికీ ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చేశాడు రణవీర్. దీపికతో కలిసి ఓ పడవలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోని షేర్ చేస్తూ.. తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు అని పోస్ట్ చేశాడు.

ఈ ఫోటో షేర్ చేసిన కొంత సమయానికే ముంబైలో వీరిద్దరూ జంటగా ఒకే కారులో కనిపించారు. దీంతో వీరి విడాకుల వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. ఇక జూలై 28న “రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని” సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు రణవీర్. ఇక దీపిక ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తో కలిసి ప్రాజెక్టు కే లో నటిస్తోంది.