Urvashi Rautela Is Charging 1 Crore Per Minute Making Her The Highest Paid Item Girl
Urvashi Rautela : బాలీవుడ్ స్టార్ హీరోయిన్, కాంట్రవర్సీ స్టార్ ఊర్వశీ రౌతేల ( Urvashi Rautela ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాలీవుడ్ లో సినిమాల చేయడం కాకుండా ఈ మధ్యకాలంలో మన తెలుగు చిత్ర పరిశ్రమలోనూ తిష్ట వేసింది ఈ బ్యూటీ. మొదటి వరకు టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ తో… ప్రేమాయణం నడిపిన ఈ బ్యూటీ… ఇప్పుడు అతనికి చాలా దూరంగా ఉంటుంది. తన కెరీర్ పై చాలా ఫోకస్ చేసింది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ.
ఇక ఇటీవలే… తెలుగు చిత్ర పరిశ్రమంలోకి అడుగుపెట్టిన ఊర్వశి… మొదట్లోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి మరియు రవితేజ కాంబినేషన్ లో ఈ ఏడాది జనవరి మాసంలో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసింది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి. ఈ సినిమాలో దాదాపు నాలుగు నిమిషాల పాటు ఐటం సాంగ్ ఉంటుంది.

ఈ ఐటెం సాంగ్ కోసం ఏకంగా రెండు కోట్లు తీసుకుందట బాలీవుడ్ డ్యూటీ ఊర్వశి. ఇక ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో క్రేజ్ పెరిగింది. దీంతో అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాలో కూడా ఓ పాటకు స్టెప్పులు వేసింది. ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరం తేజ కాంబినేషన్లో వస్తున్న బ్రో సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయనుంది ఈ బ్యూటీ. ఇక లేటెస్ట్ గా బోయపాటి మరియు హీరో రామ్ కాంబినేషన్లో వస్తున్న స్కంద సినిమాలో కూడా ఈ బ్యూటీకి అవకాశం దక్కిందట.
ఇందులో కూడా ఒక మూడు నిమిషాల పాటు ఐటమ్ సాంగ్ ఉందట. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటిఫుల్ సెలెక్ట్ చేసిందట చిత్ర బృందం. ఇక ఈ మూడు నిమిషాల పాటు సాగే ఐటమ్ సాగు కోసం ఏకంగా మూడు కోట్లు డిమాండ్ చేసిందట బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి. అంటే ఒక్క నిమిషానికి ఒక కోటి రూపాయలు ఈ బ్యూటీ సంపాదిస్తుందన్నమాట. దీంతో ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రెమ్యూనరేషన్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది.