Chiranjeevi : చిరంజీవి సినిమాను నిండా ముంచేసిన డిజే టిల్లు..?

siddu-and-chiru
siddu-and-chiru

Siddu Left From Chiranjeevi Movie

Chiranjeevi : టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లోకి చాలా మంది యంగ్ హీరోలు వస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. కానీ ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయి దూసుకుపోతున్నారు ఈ హీరోలు. అలా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న హీరో జొన్నలగడ్డ సిద్దు. సింధు జొన్నలగడ్డ గురించి ఎంత చెప్పినా తక్కువే. డీజే టిల్లు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.

అయితే ఈ డిజె టిల్లు సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో… హీరో సిద్దు జొన్నలగడ్డకు మంచి క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు హీరో సిద్దు జొన్నలగడ్డపై వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవికి ఊహించిన షాక్ ఇచ్చాడట సిద్దు జొన్నలగడ్డ. మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) మరియు దర్శకుడు కళ్యాణకృష్ణ కాంబినేషన్లో ఒక సినిమా వస్తోంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు అనే సినిమాను చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు.

siddu-and-chiru
siddu-and-chiru

బంగార్రాజు సినిమాని కళ్యాణ్ కృష్ణకు మొదటిది. మొదటి సినిమాతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మంచి సక్సెస్ అందుకోవడంతో… మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనతో సినిమా చేయాలని అనుకున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో బ్రో డాడీ అనే మలయాళ సినిమా ను తెలుగులో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

అయితే ఈ సినిమాలో చిరంజీవికి కొడుకుగా సిద్దు జొన్నలగడ్డను ఫైనల్ చేసిందంట చిత్ర బృందం. దీనికోసం ఏకంగా నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేశాడట సిద్దు జొన్నలగడ్డ. అయితే చివరి నిమిషంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాకు బిగ్ షాక్ ఇచ్చాడు సిద్దు జొన్నలగడ్డ. తనకు డేట్స్ కుదరవని… ఈ సినిమా తాను చేయబోనని నిర్ణయం తీసుకున్నారని సిద్దు జొన్నలగడ్డ. దీంతో సిద్దు జొన్నలగడ్డ స్థానంలో మరో టాలీవుడ్ హీరో కోసం చిత్రం బృందం ప్రయత్నాలు చేస్తోందట.