CM Jagan : ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ ట్విస్ట్..మళ్లీ సీఎం కావడం ఖాయమేనా ?

cm jagan
cm jagan

CM Jagan Clarity On Early Elections

CM Jagan :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో.. ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలతో పాటు అధికార వైసీపీ పార్టీ కూడా ఎలక్షన్ మూడ్ లోకి వెళ్ళింది. చంద్రబాబు నాయుడు వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తూ ఉంటే… అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాలలో వారాహి యాత్రను కొనసాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ వారాహి యాత్రలో భాగంగా… వాలంటీర్లను టార్గెట్ చేసి… విమర్శలు చేస్తున్నారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిత్యం వైసిపి పార్టీని టార్గెట్ చేసి.. జనాల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక ఈ తరుణంలోనే… ఏపీ ప్రతిపక్షాలను పూర్తిగా డైవర్ట్ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయన్న వార్తలు వస్తున్నయన్న నేపథ్యంలో.. ప్రతిపక్షాలకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు సీఎం జగన్. నిన్న ఏపీ కెబినేట్ సమావేశంలో… ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ ( CM Jagan  ) క్లారిటీ ఇచ్చారు.

cm jagan
cm jagan

ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయని… ఈ ఎన్నికలలో నేపథ్యంలో అందరూ సన్నద్ధం కావాలని పేర్కొన్నారు సీఎం జగన్. మరో 9 నెలలు మాత్రమే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ జనాల మధ్య ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జగనన్న సురక్ష క్యాంపెయిన్ ను మంత్రులు కచ్చితంగా పర్యవేక్షించాలని.. ఈ కార్యక్రమం కారణంగా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని వెల్లడించారు.

గడపగడప మన ప్రభుత్వం పై కూడా మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలని.. మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు సీఎం జగన్. సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలలో కూడా మంత్రులు పర్యటించి అన్ని వివరాలు తెలుసుకోవాలని కోరారు. ఇక సీఎం జగన్ ఎన్నికలపై చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు లేవన్న మాట. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రతిపక్షాలు చెబుతున్న నేపథ్యంలో.. వారికి సీఎం జగన్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.