Mahesh Babu’s fans attack Samantha
Kushi Movie : అక్కినేని నాగచైతన్య మాజీ భార్య సమంత మరోసారి ట్రోలింగ్ కు గురైంది. మహేష్ బాబు ఫ్యాన్స్ చేతిలో పచ్చి బూతులు పడుతోంది హీరోయిన్ సమంత. హీరోయిన్ సమంత మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఖుషి ( Kushi Movie ) అనే సినిమా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తూ ఉండగా… దీనికి శివ నిర్వాణ కథ అందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.
ఇండియా బోర్డర్ అయిన కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో అందమైన ప్రేమ కథగా ఈ సినిమా రూపొందుతోంది. అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి… ఆరాధ్య అనే సాంగ్ చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ ఆరాధ్య పాటలో విజయ్ దేవరకొండ మరియు సమంత ( Samantha )ల మధ్య మంచి కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయింది. ఈ పాటలో వీరిద్దరి మధ్య మంచి సన్నివేశాలు కూడా అందంగా వచ్చాయి. ఇక్కడ వరకు అంతా బాగా ఉంది.. కానీ ఈ పాట పై… మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరాధ్య పాటలో విజయ్ దేవరకొండ పక్కన… కూర్చొని తన కుడి చేతిని, విజయ్ కాలనీ సమంత తాకుతూ ఉంటుంది. ఈ విషయంపైనే.. ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సమంత.. మహేష్ బాబు సినిమాపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇప్పుడు ఫైర్ అవుతున్నారు ఆయన ఫ్యాన్స్. మహేష్ బాబు హీరోగా NO. 1 నేనొక్కడినే సినిమా చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో మహేష్ బాబు బీచ్ లో నడుస్తుండగా… అతని వెనక హీరోయిన్ మోకాలి మీద పాకుతూ ముందుకు వెళుతుంది. అయితే ఈ సీన్ గురించి అప్పట్లో సమంత పోస్ట్ పెట్టింది. మహిళలను సినిమాలను ఇంత నీచంగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే సమంత అప్పట్లో చేసిన ఈ పోస్ట్ ను గుర్తుచేస్తూ… మహేష్ బాబు ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఆరాధ్య పాటలో నువ్వు చేస్తున్నది ఏంటి…? సాటి మహిళా అయ్యుండి నువ్వు ఇలా చేస్తావా ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
No Hate But Sorry #Samantha
Karma Hits Back ? pic.twitter.com/eTKTk3NQo8— Nikhil_Prince? (@Nikhil_Prince01) July 12, 2023