Cm Jagan Big Sketch For Pawan Kalyan
Pawan Kalyan : ఏపీ రాజకీయాలు గత నెల రోజులుగా చాలా హాట్ హాట్ గా నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏం జరుగుతుందో…అనే టెన్షన్ అందరికీ ఉంది. ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు ఇప్పటినుంచే జనాలలో తిరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వారాహి పేరుతో ఏపీలో తిరుగుతున్నాడు. 2019 ఎన్నికలలో విఫలం అయినట్లు… కాకుండా ఈసారి… మాత్రం మెజారిటీ సీట్లు గెలవాలని భావిస్తున్నాడు పవన్ కళ్యాణ్.

ఇందులో భాగంగానే వారాహి పేరుతో ఏపీలో యాత్రలు నిర్వహిస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఈ సందర్భంగా… ఏపీ ప్రభుత్వంపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఏపీలో ప్రతిష్టంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి… అందరికీ షాక్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఏపీలో అమ్మాయిల మిస్సింగ్.. ఏపీ వాలంటీర్లు కారణం అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.
ఈ తరుణంలోనే… ఆ వాలంటీర్లతోనే పవన్ కళ్యాణ్ ను దెబ్బ కొట్టేందుకు వైసిపి ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పై పోటీకి వాలంటీర్ను బరి లోకి దించేందుకు ప్లాన్ చేస్తోంది వైసిపి పార్టీ. ఈ విషయాన్ని తాజాగా ఏపీ మంత్రి జోగి రమేష్ వివరించారు. వాలంటీర్ మరియు సచివాలయ వ్యవస్థలు విజయవంతం కావడం వల్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలెంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి జోగి రమేష్.
పక్క తెలంగాణ రాష్ట్రంలో నివసించే పవన్ కళ్యాణ్ కు ఏపీతో సంబంధం లేదని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంలో వాలంటీర్ ను నిలబెట్టి, గెలిపించి సత్తా చూపిస్తామని సవాల్ విసిరారు రమేష్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే… పొత్తులు లేకుండా బరిలోకి దిగాలని సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్.