Is there a conspiracy behind Rashmika?
Rashmika: ఇటీవలి కాలంలో తరచూ వార్తలలో నిలుస్తోంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ఆ మధ్య ఈమె తన మేనేజర్ చేతిలో మోసపోయిందనే పుకార్లు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీంతో ఈ వార్తలలో ఎటువంటి నిజం లేదని.. పరస్పర అంగీకారంతోనే మేనేజర్ ఉద్యోగం నుండి తప్పుకున్నట్లు తెలిపింది రష్మిక. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో పుష్ప 2, బాలీవుడ్ లో యానిమల్, మరో రెండు తమిళ సినిమాలు, ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది.
అయితే వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ – రష్మిక కాంబోలో వచ్చిన భీష్మ సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీరి కాంబోలో కొద్ది వారాల క్రితం రెండవ సినిమాకి అనౌన్స్మెంట్ చేశారు. ఓ వీడియోతో అద్భుతంగా ఆ చిత్రాన్ని అనౌన్స్ చేసింది మూవీ యూనిట్. అయితే అనూహ్యంగా ఈ సినిమా నుండి రష్మిక తప్పుకుందనే వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.
కారణం ఏంటంటే ఆమెపై ఓ వ్యక్తి కుట్ర చేస్తున్నాడట. అతను మరెవరో కాదు రష్మిక కి మేనేజర్ గా వ్యవహరించిన కిరణ్ అనే వ్యక్తి. అతని వల్లే రష్మిక ఈ సినిమా నుండి తప్పుకుందంటూ ఫిలింనగర్ వర్గాలలో టాక్ నడుస్తోంది. వీరిద్దరి మధ్య విభేదాలు మొదలైనప్పటినుండి మాజీ మేనేజర్ రష్మిక గురించి దర్శకనిర్మాతల వద్ద వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారట. ఆమెకి టాలీవుడ్ పై పెద్దగా ఆసక్తి లేదని, ఆమె దృష్టి అంతా బాలీవుడ్ పైనే ఉందని ప్రచారం మొదలుపెట్టాడని టాక్. ఇక ఆమెకు బదులుగా అతడు శ్రీలీల మృనాల్ ఠాకూర్ వంటి హీరోయిన్ల పేర్లని మేకర్స్ దగ్గర ప్రస్తావిస్తున్నాడట.
ఈ వ్యవహారం రష్మిక దృష్టికి రావడంతో మనస్థాపానికి గురైందో, లేక ఈగో కి వెళ్ళిందో ఆమె స్వయంగా నితిన్ చిత్రం నుండి తప్పుకున్నట్లు టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఈ సినిమా నుండి తప్పుకోవడానికి గల కారణం అడిగితే మాత్రం డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని చెబుతుందట. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ రూమర్స్ లో నిజం ఎంతుందో తెలియాలంటే మాత్రం రష్మిక స్పందించాల్సిందే.