Raja Singh : సీఎం కేసీఆర్ బిగ్ స్కెచ్..BRS లోకి రాజా సింగ్ !

Raja Singh In to BRS

Raja Singh : తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత… అక్కడ ఎఫెక్ట్… మన తెలంగాణ రాష్ట్రంలో పడింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం కారణంగా… తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీలో కీలక నేతలు… కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరియు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అటు విజయశాంతి కూడా పార్టీ మారబోతుందని విపరీతంగా వార్తలు వచ్చాయి.

అలాగే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా తన సొంత పార్టీ అయిన భారత రాష్ట్ర సమితిలోకి మళ్లీ వెళ్లేందుకు సన్నద్ధమైనట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అధిష్టానం… అసంతృప్త నేతలపై ఫోకస్ చేసి వారిని చల్లపడేలా చేసింది. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ ను పక్కకు నెట్టి… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేసేసింది బిజెపి పార్టీ. అలాగే ఈటల రాజేందర్ మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి…. పదవులు కట్టబెట్టింది బిజెపి పార్టీ.

ఇక ఈ నేపథ్యంలో… గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్… తెలంగాణ మంత్రి హరీష్ రావు తో సమావేశం బిజెపికి షాక్ ఇచ్చాడు. హరీష్ రావుతో రాజాసింగ్ భేటీ కావడంతో అందరూ… ఆయన… భారత రాష్ట్ర సమితిలోకి వెళ్తున్నారని ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఈ సమావేశం అనంతరం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్… స్పందించారు.

తన నియోజకవర్గంలో ఆసుపత్రి నిర్మించేందుకు మాత్రమే హరీష్ రావును తాను కలిసినట్టు ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను బిజెపిలో ఉంటానని… చనిపోయిన ఆ పార్టీలోనే చనిపోతానని కుండబద్దలు కొట్టి చెప్పాడు రాజాసింగ్ ( Raja Singh  ). కానీ వాస్తవానికి… భారత రాష్ట్ర సమితిలోకి రాజాసింగ్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారట. కానీ భారత రాష్ట్ర సమితితో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అందుకే ఆయన ఇలా ప్లేట్ మార్చి మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.