Do you know who is the star comedian who gave up the role of ‘Gali Seenu’ in the movie ‘Gamyam’?
Gamyam: జాగర్లమూడి రాధాకృష్ణ ( క్రిష్) దర్శకత్వంలో 2008లో విడుదలైన చిత్రం గమ్యం. అల్లరి నరేష్, శర్వానంద్ హీరోలుగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఇక కమలిని ముఖర్జీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అటు అల్లరి నరేష్, శర్వానంద్ కెరీర్లని కూడా నటన పరంగా ఈ సినిమా మార్చేసిందని చెప్పవచ్చు.
కేవలం 57 రోజులలోనే ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేశారు క్రిష్. ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం, రావు రమేష్, హేమ, ఎమ్మెస్ నారాయణ, ఎల్బి శ్రీరామ్, గిరిబాబు తదితరులు కీలక పాత్రలలో నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లరి నరేష్ పోషించిన గాలి శీను అనే పాత్ర సినిమాకే హైలైట్. ఈ పాత్రను చూసి కంటతడి పెట్టని ప్రేక్షకుడు అంటూ ఎవరూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ పాత్ర పోషించినందుకు అల్లరి నరేష్ కి ఉత్తమ నటుడిగా నంది అవార్డు మరియు ఫిలింఫేర్ అవార్డులు కూడా దక్కాయి. ఇలాంటి మంచి స్టోరీ తో సినిమాలు వచ్చి చాలా ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఇలాంటి కథని తీసుకువచ్చే దర్శకుడు లేడనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ పోషించిన గాలి శీను పాత్ర కోసం మొదట దర్శకుడు క్రిష్ ఓ స్టార్ కమెడియన్ ని అనుకున్నారట.
ఆయన ఎవరో కాదు కమెడియన్ సునీల్. ఆయనని సంప్రదించి కథ మొత్తం వివరించారట దర్శకుడు. కానీ ఆ సమయంలో సునీల్ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాకి ఒప్పుకోలేదట. దీంతో సునీల్ స్థానంలో అల్లరి నరేష్ అయితే న్యాయం చేయగలుగుతాడని భావించిన క్రిష్ ఈ పాత్రలో అల్లరి నరేష్ ని ఓకే చేశారు. ఇక అల్లరి నరేష్ ఈ పాత్రకి ఎంతలా న్యాయం చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ఓ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు సునీల్.