Heroine fixed for Rajamouli-Mahesh Babu’s movie
Mahesh Babu : మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో… దర్శకుడు రాజమౌళి సినిమాలంటే ఓ రేంజ్ లో ఉంటాయి. ఎవరు ఊహించలేనిది… ఎవరు అనుకోలేనిది చేసి చూపిస్తాడు జక్కన్న. ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో ఓటమి అనేది ఎరుగని అరుదైన దర్శకుడు రాజమౌళి. అయితే అలాంటి దర్శకుడు రాజమౌళి ఇప్పుడు… ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు కథను రెడీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.
భారతదేశ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తోంది. దాదాపు ఈ సినిమాను 1700 కోట్లతో నిర్మిస్తున్నాడట రాజమౌళి. దీంతో అందరి చూపులు రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పైనే ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు ( Mahesh Babu ) త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోయేసరికి 2024 సంవత్సరం వస్తుంది. అంటే 2024 సంవత్సరంలో… మహేష్ బాబు మరియు రాజమౌళి సినిమా ప్రారంభమవుతుందన్నమాట.
దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఈ సినిమాను రెండు భాగాల్లో తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. ఇది ఇలా ఉండగా తాజాగా రాజమౌళి మరియు మహేష్ బాబు సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభం కాకముందే.. ఈ సినిమాలో హీరోయిన్ల గురించి సెర్చ్ చేయడం జక్కన్న మొదలుపెట్టాడట.
ఈ సినిమాలో మహేష్ బాబుతో రొమాన్స్ చేసేందుకు.. ముగ్గురు భామలను రంగంలోకి లించేందుకు జక్కన్న భారీ స్కెచ్ వేశాడట. అంతేకాదు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఆ ముగ్గురు భామలను తీసుకురానున్నాడట జక్కన్న. అతి త్వరలోనే దీనిపై కసరత్తు చేసి… పేర్లు కూడా ప్రకటించనున్నాడట జక్కన్న. కాగా ఈ సినిమా ఎక్కువ భాగం అమెజాన్ అడవుల్లో చిత్రీకరించనున్నారట. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు ఓ ప్రపంచ యాత్రికుడిగా కనిపించనున్నాడని సమాచారం.