Pawan Kalyan has rare health issue
Pawan Kalyan : ఏపీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ పేరుతో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తన ప్రచారాన్ని సజావుగా చేసుకోవాల్సింది పోయి.. సీఎం జగన్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అయితే.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకు తాజాగా ఏపీ మంత్రి వర్యులు అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉందని..ఈ వ్యాధి కారణంగా పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు అంబటి. దీనికి ఎవరైనా చికిత్స చేసే వారు ఉంటే ముందుకు రావాలని… ఒక కేస్ స్టడీగా పనికి వస్తుందంటూ ఎద్దేవా చేశారు. పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చి ఊగిపోయాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఏకపత్నీ వ్రతుడంటూ చురకలు అంటించారు. ఏక కాలంలో ఒక పత్నీనే ఉంటుందని.. ఇది బాగుందా?? అన్నారు.
పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లో 373 సార్లు జగన్ పేరును ఉచ్ఛరించాడని…వెయ్యి సార్లు జగన్ పేరు ఉచ్ఛరించటం పూర్తి చేస్తే పవన్ కళ్యాణ్ పాపాలు కొన్ని అయినా కొట్టుకుపోతాయంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. బందరు వెళ్ళి చెప్పులు వెతుక్కుంటే మంచిదని… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ధర్మ రక్షణకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అట…దేవుడు దగ్గర పెట్టిన దీపంతో సిగరెట్ ముట్టించుకున్న కానిస్టేబుల్ కొడుకు హిందూ ధర్మ రక్షణకు వచ్చాడట అంటూ ర్యాంగింగ్ చేశారు అంబటి.
పోలవరం గురించి దుష్టచతుష్టయం పుంఖానుపుంఖాలుగా రాస్తున్నారని.. పోలవరం పై మా ప్రభుత్వమే కీలకంగా దృష్టి పెట్టిందని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు ఇదని.. టీడీపీ హయాంలో స్పిల్ వే సగంలో వదిలేశారని ఆగ్రహించారు. స్పిల్ వే ను పూర్తి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని..నదిని డైవర్ట్ చేసిన ఘనత జగన్ దే అని చెప్పారు మంత్రి అంబటి రాంబాబు.