Sai Dharam Tej in Another Controversy
Sai Dharam Tej : మెగాస్టార్ కుటుంబంలో చాలా మంది హీరోలు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. మెగాస్టార్ కుటుంబంలో ఎంత మంది హీరోలు వచ్చినప్పటికీ… మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ కు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు సాయిధరమ్ తేజ్.
ఇక మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న సాయిధరమ్ తేజ్… ఇటీవలే విరూపాక్ష అనే సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. రిపబ్లిక్ సినిమా కంటే ముందు… అంటే గత రెండు సంవత్సరాల కింద వినాయక చవితి సందర్భంగా… ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ గాయపడ్డాడు. అతివేగంగా స్పోర్ట్స్ బైక్ పైన వెళ్లిన సాయి ధరంతేజ్.. అదుపు తప్పి కింద పడిపోయాడు. ఇక ఆ గాయాల నుంచి కోరుకున్న తర్వాత… విరూపాక్ష సినిమా చేసి అఖండ విజయాన్ని మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ ( Sai Dharam Tej ).
ఇది ఇలా ఉండగా తాజాగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో బ్రో సినిమా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఈనెల 28వ తేదీన చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది చిత్ర బృందం. అయితే ఈ సినిమా రిలీజ్ కాదన్నా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించాడు సాయిధరమ్ తేజ.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ… ఈ పూజలు చేస్తున్న నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. పూజా సమయంలో శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో… స్వయంగా గుళ్లోకి వెళ్లి స్వామివారికి హారతి ఇచ్చాడు సాయి ధరంతేజ్. హిందూ నియమం ప్రకారం దేవుడికి అర్చకులు మాత్రమే హారతి ఇవ్వాలి.. కానీ సాయిధరమ్ తేజ స్వయంగా ఇవ్వడంతో హిందూ సంస్థలు… అక్కడ ఉన్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇది టాలీవుడ్ సర్కిల్స్ లో వివాదంగా మారిపోయింది.