Tamanna: రామ్ చరణ్, నాగచైతన్య పై తమన్నా సంచలన కామెంట్స్..!

Tamanna

Tamanna sensational comments on Ram Charan and Naga Chaitanya..!

Tamanna: ఇటీవల విడుదలైన “జైలర్” సినిమాలోని ‘నువ్వు కావాలయ్యా’ అనే సాంగ్ తో మిల్కీ బ్యూటీ తమన్న యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇదే కాకుండా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది మిల్కీ బ్యూటీ.

ఇటీవల లస్ట్ స్టోరీస్ 2 సినిమాలో బోల్డ్ సన్నివేశాలలో ఎంతలా రెచ్చిపోయిందో చూసాం. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. తెలుగు హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగచైతన్య పై తమన్నా చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

” నేను ఎంతో మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. వారిలో నాకు బాగా నచ్చింది మాత్రం రామ్ చరణ్, నాగ చైతన్య. ఈ ఇద్దరికీ అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో తెలుసు. అమ్మాయిలని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసు. వాళ్లని అంత గొప్పగా వాళ్ళ తల్లిదండ్రులు పెంచారు. ఈ ఇద్దరి విషయంలో వాళ్ళ తండ్రులు చిరంజీవి సార్, నాగార్జున సార్ లకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ఇండస్ట్రీలో నేను టాప్ హీరోయిన్ అవుతానని మొట్టమొదటగా నమ్మిన వ్యక్తి చిరంజీవి. రామ్ చరణ్ తో కలిసి సినిమా చేస్తున్న సమయంలో నాకు ఆ విషయాన్ని చెప్పారు. ఇక నాగార్జున సార్ తో నటించడం చాలా బాగా అనిపిస్తుంది. ఆయనతో నటించడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. అయితే మిగతా హీరోల అభిమానులు మాత్రం తమన్నా పై మండిపడుతున్నారు.