CM KCR : గజ్వేల్ కు కేసీఆర్ గుడ్ బై..అక్కడి నుంచే బరిలోకి !

cm kcr

KCR good bye to Gajwel

CM KCR : తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో గులాబీ బాస్, కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇప్పటినుంచి వ్యూహాలు రచిస్తున్నారట. ఇందులో భాగంగానే ఇప్పటికే 20 మంది అసెంబ్లీ అభ్యర్థులను కూడా రెడీ చేశారట. త్వరలోనే పూర్తి లిస్టును తయారు చేసి… ప్రకటించింది కూడా సిద్ధమయ్యారట సీఎం కేసీఆర్.

ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ తన నియోజకవర్గం గురించి కీలక నిర్ణయం తీసుకున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గజ్వేల్ నియోజకవర్గానికి గుడ్ బై చెప్పేందుకు సీఎం కేసీఆర్ ( CM KCR )… వ్యూహాలు రచిస్తున్నారట. గత రెండు అసెంబ్లీలలో అంటే.. 2014 మరియు 2018 అసెంబ్లీ ఎన్నికలలో… సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

cm kcr

అంతకుముందు మెదక్ ఎంపీగా, మహబూబ్నగర్ ఎంపీగా అలాగే కరీంనగర్ ఎంపీగా కూడా పనిచేశారు సీఎం కేసీఆర్. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో… అప్పటినుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎంచుకొని… ముందుకు సాగుతున్నారు సీఎం కేసీఆర్. అయితే మరో నాలుగు నెలల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో… తన నియోజకవర్గాన్ని మార్చాలని అనుకుంటున్నారట సీఎం కేసీఆర్.

గజ్వేల్ స్థానంలో ఆలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారట సీఎం కేసీఆర్. ప్రస్తుతం ఆలేరు నియోజకవర్గ జనరల్ కేటగిరి. అలాగే గొంగిడి సునీత ఆలేరు నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే. అక్కడ భారత రాష్ట్ర సమితి చాలా బలంగా ఉంది. యాదాద్రి పేరుతో ఆలేరు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. దీంతో… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి పోటీ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట.