Rashmika Mandanna review on baby movie
Rashmika Mandanna : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది.. ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్లు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రమే బాగా ఫేమస్ అవుతున్నారు మన చిత్ర పరిశ్రమలో..! అచ్చం అలాగే అతి తక్కువ కాలంలో మన తెలుగు చిత్ర పరిశ్రమలో కర్ణాటక బ్యూటీ రష్మిక మందాన చాలా పాపులర్ అయిపోయింది. 2016 సంవత్సరంలో కిరిక్ పార్టీ అనే సినిమాతో కన్నడ ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే పలు అవార్డులను కూడా సంపాదించుకుంది.
అలాగే 2018 సంవత్సరంలో నాగ శౌర్య హీరోగా నటించిన చలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి కూడా అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీతగోవిందం సినిమా చేసి… తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయిపోయింది హీరోయిన్ రష్మిక. అయితే గీత గోవిందం సినిమా తర్వాత.. విజయ్ దేవరకొండ తో డియర్ కామ్రేడ్ సినిమా కూడా చేసింది రష్మిక ( Rashmika Mandanna ).

అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి హీరోయిన్ రష్మిక మరియు… విజయ్ దేవరకొండ మధ్య ఏదో సంబంధం ఉందని.. వీరిద్దరి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా.. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమాను రష్మిక చూసింది. ఇక ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాపై రేటింగ్ కూడా ఇచ్చింది రష్మిక. బేబీ సినిమాలో ఉన్నటువంటి పాత్రలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈ సినిమాలో నటీనటులు చాలా అద్భుతంగా నటించారని చెప్పుకొచ్చింది రష్మిక మందాన.
ఈ సినిమా చూస్తుంటే నాకు చాలా కన్నీళ్లు వచ్చాయి అని ఎమోషనల్ అయిపోయింది. ఈ సినిమాలోని సీన్స్ నా మదిలో ఇప్పటికీ.. ఇప్పటికీ నిలిచిపోతాయి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది రష్మిక మందాన. ఇక ఈ పోస్ట్ చూసిన నేటిజన్స్ తమకు నచ్చిన విధంగా రష్మికపై కామెంట్స్ చేస్తున్నారు. తన మరిదిపై ప్రేమతో బేబీ సినిమాను రష్మిక చూసిందని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. మరిది కాబట్టి కచ్చితంగా… ఆనంద్ దేవరకొండ చేసిన ప్రతి సినిమాలు చూడాల్సిందే అని కొంతమంది అంటున్నారు.
I got to watch #babythemovie
I teared up watching the performances so much that I think the scenes are going to be engraved in my heart for a long long time..
Congratulations to the team.. ❤️?— Rashmika Mandanna (@iamRashmika) July 15, 2023