CI Anju Yadav : వివాదంలో పవన్ కళ్యాణ్..యాదవుల చేతులో ఇక తన్నులు తప్పవు ?

CI-Anju-Yadav-vs Pawan-Kalyan

CI Anju Yadav :  జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటినుంచే… వారాహి యాత్ర పేరుతో… జనాల్లోకి వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా నిలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ఏపీలో అమ్మాయిలు మిస్ కావడానికి వాలంటీర్ వ్యవస్థ కారణమంటూ ఘాటు వ్యాఖ్యలు చేసి… వాలంటీర్ల ఆగ్రహానికి గురయ్యాడు పవన్ కళ్యాణ్. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఈసారి యాదవుల ఆగ్రహానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురయ్యాడు. యాదవుల జోలికి వస్తే తాటతీస్తామని పవన్ కళ్యాణ్ కు తాజాగా హెచ్చరికలు కూడా జారీ చేశారు ఆ సంఘ నేతలు. వారం రోజుల కిందట జనసేన నేత ఆయన సాయి చెంప చెల్లుమనిపించింది శ్రీకాళహస్తి సిఐ అంజూ యాదవ్. జనసేన నేతలు ధర్నా చేస్తుంటే… పోలీసుల విధుల్లో భాగంగానే…. జనసేన నేత సాయి పై దాడి చేసింది సిఐ అంజూ యాదవ్ ( CI Anju Yadav ).

అయితే ఈ శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ పై… ఆగ్రహం కట్టలు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్… ఇవాళ తిరుపతి ఎస్పీకి ఆమెపై ఫిర్యాదు చేశాడు. అంతేకాదు మహిళని చూడకుండా..
సీఐపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇదే అంశం ఏపీలోని యాదవ సంఘానికి కోపం తెప్పించింది. బీసీ బిడ్డ అయిన శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ పై… పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గమని ఫైర్ అయ్యారు.

ఒక బీసీ బిడ్డ కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడని… ఇంకోసారి బీసీల జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరించారు యాదవ సంఘం నేతలు. తెలుగుదేశం ప్రభుత్వంలో వనజాక్షి పై చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే నువ్వు ఎక్కడ ఉన్నావ్… అప్పుడు తెలుగుదేశ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు యాదవ సంఘం నేతలు. అయితే ఈ వివాదంతో… ఏపీలో ఉన్న యాదవ ఓటర్లు జనసేనకు దూరం అవుతారని రాజకీయ విశ్లేషకులు.