Do you know how many crores of assets comedian Brahmanandam has?
Brahmanandam: టాలీవుడ్ ఇండస్ట్రీలో హాస్యనటుడిగా ఓ వెలుగు వెలిగిన బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తూ వందలకు పైగా సినిమాలలో నటించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు బ్రహ్మానందం. హీరోలతో పాటుగా సమానమైన స్టార్ స్టేటస్ కలిగిన ఏకైక కమెడియన్ బ్రహ్మానందం అని చెప్పడంలో సందేహం లేదు.
కొన్ని సినిమాలు ఈయన వల్లే సక్సెస్ అయ్యాయి కూడా. తన కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు బ్రహ్మానందం. అలాగే ఆయన నటనకు గాను ఎన్నో అవార్డులు వచ్చిపడ్డాయి. అయితే గత కొద్ది రోజులుగా పలు అనారోగ్య సమస్యల వల్ల సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే తిరిగి కొన్ని సినిమాలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. అయితే బ్రహ్మానందం సినిమాలలో నటిస్తూ బాగానే ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం చాగంటివారిపాలెం లో జన్మించిన ఈ హాస్యబ్రహ్మ 1987లో వచ్చిన అహ నా పెళ్ళంట అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడి నుండి అంచలంచలుగా ఎదిగి ప్రస్తుతం కోటి నుండి.. కోటి యాభై లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
బ్రహ్మానందం ఆస్తి విలువ 500 నుండి 600 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అంతేకాకుండా ఆయనకి జూబ్లీహిల్స్ లో ఓ బంగ్లా, కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా ఉన్నాయట. ఇక ఆయన కొడుకులు కూడా బాగానే సంపాదిస్తున్నారు. ఆయన పెద్ద కుమారుడి కంటే ప్రస్తుతం చిన్న కుమారుడు బాగానే ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం.