Meenakshi Choudary comments on Mahesh Babu
Meenakshi Choudary : ప్రిన్స్ మహేష్ బాబు… ఈ పేరు చెప్తే అందరూ ఎగ్జాయిట్ అయిపోతారు. ముఖ్యంగా ఫ్రెండ్స్ మహేష్ బాబు అంటే మహిళలు పడి చచ్చిపోతారు. మహేష్ బాబుకు మహిళల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్ లలో ఎక్కువగా మహిళలే ఉంటారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమాలతో ముందుకు సాగుతున్నాడు.
సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత… ఇప్పుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. అతడు మరియు ఖలేజా సినిమాలు ఇప్పటికే థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా వస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే మొన్నటి వరకు గుంటూరు కారం సినిమా హీరోయిన్ పై తీవ్ర సందిగ్ధత నెలకొంది. మొదట అనుకున్న పూజా హెగ్డే అని పక్కకు జరిపి… మెయిన్ హీరోయిన్ గా శ్రీ లీలను తీసుకున్నారని ప్రచారం జరిగింది.

ఇక రెండో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని ఫైనల్ చేసిందట చిత్ర బృందం. ఈ తరుణంలో ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర విషయాన్ని మీనాక్షి చౌదరి తెలిపారు. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ గుంటూరు కారం చిత్రంలో తాను కూడా పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించింది హీరోయిన్ మీనాక్షి చౌదరి ( Meenakshi Choudary ). తాజాగా ఒక ఈవెంట్లో పాల్గొన్న మీనాక్షి చౌదరి ఈ విషయాలను పేర్కొంది. నేను సూపర్ స్టార్ మహేష్ బాబు కు చాలా పెద్ద అభిమానిని అని చెప్పుకొచ్చింది. నా ఫస్ట్ డే ఫస్ట్ షార్ట్ మహేష్ బాబు తోనే జరిగిందని వెల్లడించింది.
ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమా విడుదల కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే మీనాక్షి చౌదరి చేసిన ఈ కామెంట్లపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మహేష్ బాబు తో ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అంటూ కామెంట్ చేయడంపై… మీనాక్షి చౌదరిపై ట్రోలింగ్ చేస్తున్నారు. నమ్రత కాపురాన్ని కూల్చడానికే నువ్వు వచ్చావా అంటూ మండిపడుతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. పచ్చటి కాపురంలో నిప్పులు పోయడానికి… గుంటూరు కారం రూపంలో వచ్చావా అని మరికొంతమంది అంటున్నారు.