Samantha : సమంత చెప్పుల ఖరీదు అంతా.. ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే!

samantha slipper cost

Samantha :  టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని నాగచైతన్య మాజీ సతీమణి సమంత ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఏం మాయ సమంత ఇప్పటికీ పోరాటం . దీంతో హీరోయిన్ సమంత క్రేజ్ మరింత పెరిగిపోయి… ఆమెకు చాలా ఆఫర్లు కూడా వచ్చాయి. 2017 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య అని పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత.. చిన్న చిన్న కారణాలు చెప్పి అక్కినేని నాగచైతన్యకు దూరమైపోయింది.

2021 సంవత్సరంలో ఈ టాలీవుడ్ అందమైన జంట ఆ విడాకులు తీసుకున్న సంగతి మనకు గుర్తుండే ఉంటుంది. సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు మంచి సినిమా ఆఫర్లు రావడమే కాకుండా…ఆమెను ఓ అరుదైన వ్యాధి కూడా ఆమెను వేధిస్తోంది. మయోసైటిస్ అనే వ్యాధితో ఇప్పటికి పోరాటం చేస్తూనే ఉంది హీరోయిన్ సమంత. ఇక ఇటీవల యశోద మరియు శకుంతలం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ సమంత ( Samantha ) త్వరలోనే ఖుషి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

వచ్చే నెలలో రిలీజ్ కానున్న ఖుషి సినిమా నుంచి ఇప్పటికే అనేక అప్డేట్స్ వచ్చాయి. శివ నిర్మాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత నటించి… అందరిని మెప్పించేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి తాజాగా సమంతకు సంబంధించిన సింపుల్ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్రం బృందం.

ఈ పోస్టర్ను చూసిన నెటిజెన్స్ చాలా ఫిదా అయిపోతున్నారు. అయితే ఇందులో సమంత వేసుకున్న చెప్పుల గురించి మాత్రం సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. చాలా అందంగా ఉన్నటువంటి ఈ చెప్పుల పేరు అపరాజిత తూర్ కైర్ హిల్స్. ఆరాధ్య సాంగ్ లో హీరోయిన్ సమంత వేసుకున్న ఈ చెప్పులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అయితే సమంత వేసుకున్న ఈ చెప్పుల ధర ఏకంగా 8 వేల రూపాయల అట. ఇప్పుడు సమంత చెప్పుల గురించే సోషల్ మీడియాలో పెద్ద టాపిక్ జరుగుతుంది.