Catherine Tresa getting marriage
Catherine Tresa : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుసగా నటీనటులు పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది నటీనటులు… కరోనా సమయం నుంచి ఇప్పటివరకు పెళ్లి ల్లు చేసేసుకున్నారు. హీరో నాగ శౌర్య సమ్మర్ ప్రారంభంలోనే పెళ్లి చేసుకోగా గత రెండు నెలల కిందట హీరో శర్వానంద్ కూడా ఓ రాజకీయ కుటుంబం కి చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
వీరి వివాహం రాజస్థాన్లో చాలా గ్రాండ్గా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు… టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన మరో హీరోయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు కేథరిన్ థెరిస్సా. అవును టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కేథరిన్ థెరిస్సా ( Catherine Tresa ) త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట. అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ హీరోయిన్ కేథరిన్ థెరిస్సా.
ఆ తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కేథరిన్.. స్టార్ హీరోల సరసన నటించి అందరిని అలరించారు. ముఖ్యంగా మెయిన్ హీరోయిన్ కాకుండా సైడ్ హీరోయిన్ పాత్రలో ఎక్కువగా కనిపించింది ఈ బ్యూటీ. ఇక ఇటీవల బింబిసార సినిమాతో.. మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. కాగా హీరోయిన్ కేథరిన్ థెరిస్సా గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ కేథరిన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది. తన చిన్ననాటి ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోవాలని హీరోయిన్ కేథరిన్ థెరిస్సా నిర్ణయం తీసుకుందట. వీరిద్దరి పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారట. దీంతో ఈ డిసెంబర్ మాసంలో వీరిద్దరి వివాహం జరగనుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.