Abbas Comments Viral
Abbas : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అలనాటి హీరో అబ్బాస్ కు మంచి గుర్తింపు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. కోల్కత్తా కు చెందిన హీరో అబ్బాస్.. అప్పట్లో మన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సినిమాలు చేశాడు. తెలుగు, తమిళ్, మలయాళం మరియు కన్నడ సినిమాలలో కూడా నటించి అందరినీ మెప్పించాడు హీరో అబ్బాస్.
అప్పట్లో అనసూయ, పొలిటికల్ రౌడీ, శ్వేత నాగు, నరసింహ, ప్రేమదేశం, రాజా లాంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోయాడు హీరో అబ్బాస్ ( Abbas ). ఇప్పటికీ మీరు అబ్బాస్ సినిమాలు వస్తే అందరూ ఎగబడి చూస్తారు. ఇక గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న హీరో అబ్బాస్ ప్రస్తుతం విదేశాలలో సెటిల్ అయిపోయాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్ దేశంలో హీరో అబ్బాస్ ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా తన కెరీర్ గురించి ఫ్యాన్స్ తో పంచుకున్నాడు హీరో అబ్బాస్. ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి అబ్బాస్ మాట్లాడుతూ… నేను పది సంవత్సరాల కిందటే నా కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ దేశానికి వెళ్లిపోయారు.. ఇప్పుడు అక్కడే హ్యాపీగా ఉంటున్నాను… అక్కడ టాక్సీ మెకానిక్ గా అలాగే డ్రైవర్ గా పనిచేస్తూ తన కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటున్నాను అని తెలిపాడు హీరో అబ్బాస్.
అయితే తాను సినిమాలోకి రాకముందు ఆత్మ**త్య ప్రయత్నం చేశానని షాపింగ్ కామెంట్స్ చేశాడు హీరో అబ్బాస్. నేను పదవ తరగతి ఫెయిలయ్యానని… అదే సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ కూడా తనను మోసం చేసి వదిలిపోయిందని చెప్పుకొచ్చాడు. ఈ రెండు బాధలతో చాలా కుమిలిపోయి… నేను ఆత్మ**త్య చేసుకునేందుకు..లారీ ముందుకు వెళ్లాలని ప్లాన్ వేశానని చెప్పుకొచ్చాడు హీరో ప్రభాస్. కానీ ఆ తర్వాత తన జీవితాన్ని ముందుకు సాగించానని వెల్లడించాడు.