Srimukhi: నన్ను అనుభవించే హక్కు కేవలం ఆ హీరోకి మాత్రమే ఉంది.. శ్రీముఖి బోల్డ్ కామెంట్స్..!

srimukhi

Anchor Srimukhi bold comments

srimukhi: ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి 100 స్పీడుతో దూసుకుపోతోంది. తన అందచందాలతో స్టార్ హీరోయిన్ కి ఉన్న రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. పటాస్ అనే ప్రోగ్రాం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను తన వాక్చాతుర్యంతో ఎంతగానో దగ్గరైనా ఈ రాములమ్మ ఆ తర్వాత ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. పలు టీవీ షోలు చేస్తూనే ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సైతం బిజీగా ఉంటుంది.

ఇదే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది. నిత్యం ఫోటో షూట్లతో, మత్తెక్కించే తన అందాలతో కుర్రకారు మతి పోగుడుతోంది. అలాగే అప్పుడప్పుడు మంచి అవకాశాలు వస్తే వెండితెరపై కూడా కనిపిస్తోంది. అంతేకాకుండా అప్పుడప్పుడు బోల్డ్ కామెంట్స్ చేస్తూ కూడా వార్తల్లో నిలుస్తుంది శ్రీముఖి. ఇదిలా ఉంటే రాములమ్మ ఇప్పటివరకు పెళ్లికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

అప్పుడప్పుడు ఈమె పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈమె మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఇటీవల బుల్లితెరలో ప్రసారమైన ఓ షోలో హోస్ట్ గా చేస్తున్న చేస్తున్న శ్రీముఖి.. ఆ షోలో భాగంగా ఓ ఫన్నీ కాన్సెప్ట్ ని నిర్వహించింది. ఈ కాన్సెప్ట్ లో భార్యలతో గొడవ పడుతున్న ఒక సన్నివేశం జరుగుతుంది. అయితే ఈ షోలో గెస్ట్ గా పాల్గొన్న పటాస్ ఫైమా.. శ్రీముఖిని నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని అడిగింది.

దీంతో తనకు ఉన్న అందానికి ఏ హీరో అయితే బాగా సెట్ అవుతాడు అని శ్రీముఖి ఫైమాని అడిగింది. ఇండస్ట్రీలో ప్రభాస్ ఒక్కడే సింగిల్ గా ఉన్నాడు అని ఆన్సర్ ఇస్తుంది ఫైమా. దీంతో శ్రీముఖి మాట్లాడుతూ.. ప్రభాస్ ఒప్పుకుంటే ఎగిరి గంతేస్తానని, ఆ హక్కు కేవలం ప్రభాస్ కి మాత్రమే ఉందని, ఆయనకు భార్యగా వెళతానంటూ చెప్పింది. దీంతో శ్రీముఖి చేసిన ఈ వ్యాఖ్యలపై పలు రకాలుగా స్పందిస్తున్నారు నెటిజెన్లు.