Jeevitha-Rajashekar : రాజశేఖర్ దంపతులకు జైలు శిక్ష !

Jeevitha-Rajashekar : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలు అయినా జీవిత, రాజశేఖర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాలలో నటించి.. పెళ్లి చేసుకున్నారు జీవిత, రాజశేఖర్ . అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా… మొదటగా జీవిత మరియు రాజశేఖర్ స్పందిస్తూ ఉంటారు. అలాగే నిత్యం వివాదాలలో చిక్కుకుంటూ ఉంటారు.

ఏదో ఒక వార్త పై స్పందిస్తూ… వివాదాలకు తెర లేపుతారు జీవిత మరియు రాజశేఖర్. అలాంటిది ఈ టాలీవుడ్ జంట అయిన జీవిత మరియు రాజశేఖర్ కు ఊహించని షాక్ తగిలింది. జీవిత మరియు రాజశేఖర్ దంపతులకు తాజాగా జైలు శిక్ష పడింది. పరువు నష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది పాటు జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించింది నాంపల్లి కోర్టు.

చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని గతంలో ఈ జంట ఆరోపించిన సంగతి మనకు తెలిసే ఉంటుంది. ఈ ఘటన 2011 సంవత్సరంలో జరిగింది. అయితే దీనిపై స్పందించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ గారు నాంపల్లి కోటను ఆశ్రయించారు. జీవిత మరియు రాజశేఖర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో… వారిద్దరిపై పరువు నష్టం దావా కేసు వేశారు సినీ నిర్మాత అల్లు అరవింద్.

ఈ ఆరోపణలపై జీవిత మరియు రాజశేఖర్ మాట్లాడిన విషయాలను అలాగే కథనాలను కోర్టుకు సమర్పించారు అల్లు అరవింద్. అయితే దీనిపై తాజాగా విచారణ చేసిన నాంపల్లి కోర్టు… కీలకతీర్పు వెలువడించింది. సినీ నటుడు జీవిత – రాజశేఖర్ ( Jeevitha-Rajashekar ) దంపతులకు.. ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది నాంపల్లి కోర్టు. జరిమానా చెల్లించడంతో పైకోర్టులో అప్పిల్ కు అవకాశం కూడా ఇచ్చింది కోర్టు. అయితే కోర్టు తీర్పుపై రాజశేఖర్ దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి.