CM YS Jagan Mohan Reddy allays fears of Muslims on UCC
Cm Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో తాజాగా సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో పంచుకున్నారు ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులు. అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం.
బడుగు, బలహీనవర్గాల, మైనార్టీల ప్రభుత్వం అంటూ వ్యాఖ్యానించారు. మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురి కావాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా వెల్లడించారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. మీ మనసు నొప్పించేలా ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించదని తేల్చి చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతి అంశంమీద డ్రాఫ్ట్ అనేది ఇప్పటివరకూ రాలేదు. అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు. కాని మీడియాలో, పలుచోట్ల చర్చ విపరీతంగా నడుస్తోందన్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. వాటిని చూసి ముస్లింలు పెద్దస్థాయిలో తమ మనోభావాలను వ్యక్తంచేస్తున్నారని చెప్పారు.
కొన్ని అంశాలను మీ అందరి దృష్టికి తీసుకు వస్తున్నానని.. ఒక రాష్ట్రానికి పాలకుడిగా, ముఖ్యమంత్రి స్థాయిలో నేను ఉన్నానని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటేగనుక ఏం చేసేవారన్నదానిపై మీరు ఆలోచనలు చేసి నాకు సలహాలు ఇవ్వండని కోరారు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ( Cm Jagan ). ఇక్కడ ఇంకో విషయాన్నికూడా మీ దృష్టికి తీసుకు వస్తున్నానని.. ముస్లిం ఆడబిడ్డల హక్కుల రక్షణ విషయంలో ముస్లింలే వ్యతిరేకంగా ఉన్నారంటూ పెద్ద ప్రొపగండా నడుస్తోంది.
ఇలాంటి దాన్ని మత పెద్దలుగా మీరు తిప్పికొట్టాలని కోరారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. ఒకే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఏ తండ్రైనా, ఏ తల్లి అయినా ఎందుకు భేదభావాలు చూపిస్తారన్నారు తెలిపారు జగన్. మహిళలకు సమాన హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీలేదనే విషయాన్ని మన అంతా స్పష్టం చేద్దామని వెల్లడించారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. ఇక ముఖ్యమంత్రి వైయస్ జగన్ వ్యాఖ్యాలతో వ్యాఖ్యలతో ఏకీ భవించిన.. ముస్లింలు….ఆయనకు అండగా ఉండనున్నారు.