Eesha Rebba : పెళ్లి కాకుండానే తల్లి అయిన తెలుగు హీరోయిన్..అతనే తండ్రి ?

Eesha Rebba Comments Viral

Eesha Rebba : టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో హీరోయిన్ సైడ్ పాత్రలలో నడిచి ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయిన బ్యూటీలు చాలామంది ఉన్నారు. అలా సైడ్ పాత్రలు చేసి తర్వాత హీరోయిన్ గా మారిపోయింది ఈషా రెబ్బ. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ బ్యూటీ… ప్రస్తుతం కీలక పాత్రలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో 2012 సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈషా రెబ్బ.

ఆ తర్వాత బందిపోటు, దర్శకుడు, రాగల 24 గంటలలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలలో కనిపించి అందర్నీ కనువిందు చేసింది. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ ఈషా రెబ్బ చేసిన కామెంట్లు… సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ఈషా రెబ్బ.. దయ అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో జెడి చక్రవర్తి కీలకపాత్ర చేస్తున్నారు. అయితే ఈ సినిమా త్వరలోనే అంటే జూలై 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇలాంటి తరుణంలో దయ వెబ్ సిరీస్ కోసం ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్ర బృందం. ఇందులో భాగంగానే ఈ మూవీ టీం… ఈషా రెబ్బతో పాటు… రవి వర్మ మరియు జెస్సి తదితరులు సుమ అడ్డ షో కు వచ్చి సందడి చేశారు. ఈ షోలో… డాన్సులు మరియు పాటలు.. జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసింది ఈ చిత్రం బృందం. అలాగే సుమ ఇచ్చే టాస్కులు, పంచులను కూడా ఆస్వాదించింది చిత్ర బృందం. ఇక ఈ షోలో భాగంగా సుమ ఓ టాస్క్ పెట్టింది ఈ చిత్ర బృందానికి…! పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుందని ఇందులో భాగంగా సుమా ప్రశ్నించింది.

దీంతో వెంటనే రియాక్ట్ అయిన బ్యూటీ ఈషా రెబ్బ… బటన్ నొక్కి ఆన్సర్ చెప్పింది. వాస్తవానికి నాకు ఇప్పటికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు అని సంచలన వ్యాఖ్యలు చేసింది ఈషా రెబ్బ ( Eesha Rebba ). దీంతో అక్కడ ఉన్న వారు అందరూ షాక్ అయ్యారు. మరి ఆ పిల్లలకు తండ్రి ఎవరు అని యాంకర్ సుమ వెంటనే అడిగేసింది. అయితే ఈ షో కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజంగానే ఈ బ్యూటీ పిల్లలను కనిందా… లేక దత్తత తీసుకుందా అనే ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తుతున్నాయి.