Soundarya: సౌందర్య ఓ హీరోతో ఎఫైర్ పెట్టుకొని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందా..?

Soundarya

Soundarya had an affair with a hero and married another man..?

Soundarya: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొంతమంది మహానటులు ప్రస్తుతం మన మధ్య లేకపోయినా వారు చేసిన ఎన్నో మంచి పాత్రలు తెలుగువారి మదిలో చిరకాలం నిలిచిపోయాయి. అలాంటి వారి వరుసలో ముందుంటుంది సౌందర్య. పేరుకు తగ్గట్టుగానే ఈమెలో సౌందర్యానికి ఏ మాత్రం కొదవ ఉండదు. సావిత్రి తర్వాత అంత గొప్ప నటిగా చూసే నటి ఎవరైనా ఉన్నారంటే సౌందర్య అనే చెప్పాలి.

అతి చిన్న వయసులోనే వెండితెరనుండి కనుమరుగైపోయిన సౌందర్యను అభిమానులు అంత త్వరగా మరిచిపోలేరు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎంతో మంది కొత్త హీరోయిన్లకు ఆదర్శంగా నిలిచిన సౌందర్య అంటే ఇప్పటికీ చాలామందికి గౌరవమే. మనవరాలు పెళ్లి సినిమాతో తొలిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సౌందర్య ఈరోజుకి ఇండస్ట్రీలో ఉండి ఉంటే ఎన్నో పాత్రలు ప్రాణం పోసుకునేవి, మరెన్నో రికార్డులు తన పేరిట నెలకొల్పేది అని ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు.

2004లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సౌందర్య టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎక్కడా హద్దులు దాటకుండా పద్ధతిగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా నిలబడింది. అలాంటి సౌందర్య గురించి సీనియర్ నటి వెన్నెరాడై నిర్మల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఎన్ శంకర్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా, సౌందర్య హీరోయిన్ గా నటించిన చిత్రం జయం మనదేరా. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం స్విట్జర్లాండ్ లో జరిగింది.

అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది వెన్నెరాడై నిర్మల. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈమె సౌందర్య కి బాగా దగ్గరయిందట. ఈ సినిమా షూటింగ్ సమయంలో సౌందర్య ఎవరినో ప్రేమిస్తున్నట్లు తనకు అర్థమైందని.. కానీ ఆ వ్యక్తి ఎవరనే విషయం తన వద్ద బయట పెట్టలేదని తెలిపింది వెన్నెరాడై నిర్మల. అయితే సౌందర్య 2003లో రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇదా నిర్మల చేసిన వ్యాఖ్యలతో ఆమె ప్రేమించిన వ్యక్తిని కాకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే వార్తలు వైరల్ గా మారాయి. అయితే కొంతమంది ఈ కామెంట్స్ లో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేస్తున్నారు.