Pawan Kalyan vs Cm jagan
Pawan Kalyan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ప్రతి పక్ష పార్టీలపై మరోసారి విరుచుకుపడ్డారు. ఇవాళ తిరుపతి జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.. ఈ సందర్భంగా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం నిధులను విడుదల చేశారు. ఇక అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. మొన్నటి వరకు ఏపీ లోని వాలంటీర్లను ఉద్దేశించి..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే.. పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సేవలు అందిస్తున్న వాలంటీర్ల క్యారక్టర్ ను తప్పు పడుతున్నది ఎవరంటే..పదేళ్లుగా చంద్రబాబు కు వాలంటీర్ గా పనిచేస్తున్న నేత అంటూ ఫైర్ అయ్యారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
చంద్రబాబు..దత్తపుత్రుడు..ఆయన సొంత పుత్రుడు..ఆయన బావ మరిది క్యారక్టర్ ఎలాంటిదో అందరికీ తెలుసు అంటూ చురకలు అంటించారు. దత్త పుత్రుడు అయిన పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )..ఒకరితో వివాహ బంధంలో ఉంటూ మరొకరితో అ***మ సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఆయన మన వాలంటీర్ల గురించి మాట్లాడతారని… ఇంకొకడు స్విమ్మింగ్ ఫూల్ లో అమ్మాయిలతో ఎలా ఉన్నాడో యు ట్యూబ్ లో కన బడుతుందంటూ నారా లోకేష్ ను ఉద్దేశించి.. విరుచుకుపడ్డారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. అమ్మాయి కనపడితే ముద్దాయినా పెట్టాలి..కడుపైన చేయాలని అంటాడంటూ బాలయ్యను ఉద్దేశించి అన్నారు. ముసలాయన అంటాడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. బి.జె.పి.తో పొత్తు అంటారు..చంద్రబాబుతో కాపురం చేస్తారని పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు సీఎం జగన్.