Aamani : పెళ్లికి ముందే నాతో పనులు చేశాడు..ఆ బాధతో నరకం అనుభవించిన ఆమని !

Aamani About her Husband

Aamani :  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలామంది సీనియర్ నటీనటులు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అందులో కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సౌందర్య, రమ్యకృష్ణ, రంభ ఇలా ఎంతో మంది హీరోయిన్లు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మైండ్ లో గుర్తుకు వస్తూనే ఉంటారు. అయితే అచ్చం ఈ హీరోయిన్ల లాగే.. టాలీవుడ్ సీనియర్ నటి ఆమని కూడా అందరికీ పరిచయమే.

అప్పట్లో రాజేంద్రప్రసాద్ చేసిన ప్రతి సినిమాలో టాలీవుడ్ నటి ఆమని ఉండేది. జంబలకడిపంబ, శుభలగ్నం, ఆ నలుగురు, మావిచిగురు, శుభమస్తు, హలో బ్రదర్, అమ్మ కొడుకు లాంటి ఎన్నో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అప్పట్లో హీరోయిన్గా నటించిన ఆమని.. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ కూడా ఇచ్చింది. హీరో తల్లిగా లేదా హీరోయిన్ తల్లిగా నటిస్తూ ముందుకు సాగుతోంది నటి ఆమని.

ఇందులో భాగంగానే చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఊర్వశివ రాక్షసివో, వినరో భాగ్యము విష్ణు కథ లాంటి సినిమాలలో కీలక పాత్రలో నటించి… అందరిని మెప్పించింది నటి ఆమని. తాజాగా… ఈ సీనియర్ నటి ఆమని ( Aamani ) గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె హీరోయిన్గా నటిస్తున్న సమయంలో… ఆమని వివాహం జరిగింది.

అయితే.. వివాహం జరిగే సమయంలో.. తన భర్త సినిమాలు చేయకూడదని కండిషన్ పెట్టాడట. దీంతో ఆ బాధ భరించలేక.. పెళ్లి కూడా వద్దనుకుందట. కానీ ప్రతి స్త్రీ వివాహం చేసుకోవాల్సిందే కదా.. ఇలాంటి బాధలు తప్ప వని డిసైడ్ చివరికి అతని కండిషన్స్ ఒప్పుకుందట. ఆ తర్వాత వీరిద్దరి వివాహం జరిగింది. అయితే ఇప్పుడు అలాంటి కండిషన్స్ పెడితే… తన భర్తను అసలు పట్టించుకోనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి ఆమని చెప్పుకొచ్చింది.