అలా ఇలా ఎలా రివ్యూ & రేటింగ్!!

Ala ila ela review 2

ప్రేమ కథలు ఎన్ని రకాలుగా చెప్పినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ప్రేమ, మోసం అనే పాయింట్లతో అలా ఇలా ఎలా అనే సినిమాను తీశారు. పూర్ణ మెయిన్ లీడ్‌గా, శక్తి వాసుదేవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ
అను (పూర్ణ) అబద్దం అంటే సహించదు. అబద్దాలు ఆడదు. అబద్దాలతో మోసం చేస్తే సహించదు. అలాంటి అను.. సూర్య (శక్తి వాసుదేవన్ )తో ప్రేమలో పడుతుంది. మరో వైపు కార్తీక్ (రాజా చెంబోలు) జైలు నుంచి తప్పించుకుని వస్తాడు. అలా వచ్చిన కార్తీక్.. మిత్రని చంపాలని అనుకుంటాడు? అసలు కార్తీక్ జైలుకి ఎందుకు వెళ్తాడు? మిత్ర ఎవరు? సూర్య ఎవరు? అనుకి, కార్తీక్‌కి ఉన్న లింక్ ఏంటి? ఆమెను మోసం చేసింది ఎవరు? చివరకు అను ఏం చేసింది? అన్నది కథ.

నటీనటులు
అను పాత్రలో పూర్ణ చక్కగా నటించింది. లుక్స్ పరంగానూ పూర్ణ మెప్పించింది. ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించింది. శక్తి వాసుదేవన్ రెండు రకాల పాత్రలను పోషించినట్టు అయింది. భిన్న పార్శ్వాలను చూపించాడు. శక్తి బాగా నటించాడు. ఇక కార్తీక్ కారెక్టర్లో రాజా బాగానే మెప్పించాడు. నాగబాబు, సితార, సీత, షాయాజీ షిండే, రేఖ ఇలా అందరూ చక్కగా నటించారు.

విశ్లేషణ
ప్రేమ కథలు ఎన్ని వచ్చినా కూడా కొత్త పాయింట్‌తో తెరకెక్కిస్తే దాన్ని జనాలు స్వీకరిస్తారు. ప్రేమ, మోసం అనే కాన్సెప్టులతో మీద ఇది వరకు చాలానే సినిమాలు వచ్చాయి. అయితే ఇందులో మాత్రం కాస్త కొత్తగా అనిపించింది. ఇంటర్వెల్ వరకు ఒక సినిమాను చూపిస్తే.. తరువాత ఇంకో రకమైన సినిమాను చూపించినట్టు అయింది. ప్రథమార్దం అంతా కూడా కాస్త ఫన్నీగా సాగుతుంది. బ్రహ్మానందం, ఆలీ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తారు.

సెకండాఫ్ కథ కాస్త సీరియస్ మోడ్‌లోకి వెళ్తుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందా? అనే ఆసక్తిని కలిగించేలా కథనాన్ని రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ అయితే ఊహకు అందదు. ఎమోషనల్ క్లైమాక్స్‌ను రాసుకున్నాడు డైరెక్టర్. చివర్లో ఇచ్చే ట్విస్ట్ కూడా బాగుంటుంది. అలా ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్టులు సినిమాలో బాగానే వర్కౌట్ అయ్యాయి. అయితే సినిమా ఎక్కడా కొత్తగా అనిపించకపోవడం మైనస్.

సాంకేతికంగా ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. మణిశర్మ పాటలు, సంగీతం మెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. ఇంకొన్ని సీన్లకు కత్తెర పడాల్సిందనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఓకే అనిపిస్తుంది. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

రేటింగ్ 3/5