Prabhas Face Failure Over aarthi agarwal
Prabhas : టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అందరిలాగే తన కుటుంబ వారసత్వం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమంలోకి అడుగు పెట్టాడు రెబల్ స్టార్ ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని… ఇండస్ట్రీలోకి వచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా.. ఎవరికి అందని ఎత్తులో ప్రభాస్ ఎదిగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే.
అయితే అందరిలాగే తన కెరీర్ లో ప్రారంభంలో ప్రభాస్ కూడా చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. మొదట్లో చాలా సినిమాలు విఫలమైనప్పటికీ ఏమాత్రం తగ్గకుండా.. ముందుకు సాగి సక్సెస్ అందుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ తన కెరీర్ ను ఈశ్వర్ సినిమాతో ప్రారంభించాడు. ఈ సినిమా పెద్దగా కలెక్షన్లు రాబట్టకపోయినా జనాలను మాత్రం అలరించింది. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయింది.
అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగిన ప్రభాస్ వర్షం సినిమాతో మళ్లీ టాలీవుడ్ ఫ్యాన్స్ ను అలరించాడు. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు ప్రభాస్. ఇక వర్షం తర్వాత వచ్చిన అడవి రాముడు సినిమా యావరేజ్ గా నడిచింది. కలెక్షన్లను పెద్దగా వసూలు చేయలేకపోయిందట అడవి రాముడు సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించిన ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించి అందరిని మెప్పించింది. ఈ సినిమా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడానికి హీరోయిన్ ఆర్తి అగర్వాల్ అని గుసగుసలు వినిపించాయి.
ఈ సినిమా షూటింగ్ సమయానికి ఆర్తి అగర్వాల్… బాడీలో చాలా మార్పులు వచ్చాయట. సినిమాకు ఒప్పుకున్నప్పుడు చాలా సన్నగా ఉన్న ఆర్తి అగర్వాల్… ఆ తర్వాత కొవ్వు చేసిందట. ఇది మనకు అడవి రాముడు సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో చాలా లావుగా కనిపిస్తుంది ఆర్తి అగర్వాల్. అయితే అలా హీరోయిన్ లావుగా ఉండటంతో… సినిమాను ఎక్కువ మంది చూసేందుకు ఆసక్తి చూపించలేదట. దీంతో సినిమా ఫ్లాఫ్ అయినట్లు ఇప్పటికే అనుకుంటున్నారు. అలా ఆర్తి అగర్వాల్ వల్ల.. ప్రభాస్ ( Prabhas ) కెరియర్ లో భారీ డిజాస్టర్ మిగిలిపోయింది అంట.