Vijayashanthi Relation shop with balayya
Vijayashanthi : టాలీవుడ్ అలనాటి నటి, ప్రస్తుత రాజకీయ నాయకురాలు విజయశాంతి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విజయశాంతి… అప్పట్లో ఇండస్ట్రీని ఏలారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్గా విజయశాంతి కొనసాగిన రోజులు కూడా ఉన్నాయి. చిరంజీవి, నాగార్జున, బాలయ్య బాబు, కృష్ణ, మోహన్ బాబు, వెంకటేష్ ఇలా ఎంతోమంది స్టార్ హీరోల సరసన ఆ కాలంలో హీరోయిన్గా నటించి అందరిని మెప్పించింది విజయశాంతి.
ఎక్కువగా విజయశాంతి చిరంజీవితో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇక సినిమాలు చేస్తూనే ఆ తర్వాత లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది ఈ బ్యూటీ. చాలా సినిమాలలో విజయశాంతినే… కథకు మెయిన్ హీరో లాగా కనిపించింది. ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలు విజయశాంతికి మంచి పేరు తీసుకువచ్చాయి. ఇక ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేస్తూ టిఆర్ఎస్ పార్టీలో చేరింది విజయశాంతి.

తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి అక్కడ కూడా కొన్ని రోజులు మాత్రమే పని చేసింది. అనంతరం బిజెపి పార్టీలో చేరి… మెదక్ జిల్లా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైంది. అయితే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మెదక్ ఎంపీగా చాలాసార్లు గెలిచింది విజయశాంతి. ఇది ఇలా ఉండగా శ్రీనివాస ప్రసాద్ ను విజయశాంతి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే శ్రీనివాస్ ప్రసాద్ను పెళ్లి చేసుకోక ముందు టాలీవుడ్ లోని అగ్ర హీరోను పెళ్లి చేసుకునేందుకు విజయశాంతి ( Vijayashanthi ) ప్రయత్నాలు చేసిందట.
ఆగ్ర హీరో ఎవరో కాదు బాలయ్య బాబు. బాలయ్య మరియు విజయశాంతి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య మంచి కోఆర్డినేషన్ బాగా సెట్ అయిందట. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. అయితే చివరికి కొన్ని అనివార్య కారణాలవల్ల వీరిద్దరూ విడిపోయినట్లు సమాచారం అందుతోంది. కాగా ప్రస్తుతం విజయశాంతి బిజెపి పార్టీలో ఉండగా బాలయ్య బాబు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు.