Jogi ramesh slams pawan and chandrababu
Cm Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఏడాది కాలంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ వారాహి యాత్ర పేరుతో ఏపీ ప్రజల్లో గుండెల్లో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
అటు తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ పాదయాత్ర ఇటు నారా చంద్రబాబు నాయుడు వరుస జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇక ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ గా వైసీపీ నేతలు అంతా గ్రామస్థాయిలో జన సురక్ష కార్యక్రమం పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలోనే పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఏపీ మంత్రులు కూడా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా ఏపీ మంత్రి జోగి రమేష్… చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిపోయాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ పిచ్చికుక్క అంటూ వ్యాఖ్యానించారు జోగి రమేష్.
పవన్ కళ్యాణ్ ఓ పిచ్చికుక్క… పెళ్లాలను మార్చినట్లే పార్టీలను మారుస్తున్నాడని నిప్పులు చెరిగారు జోగి రమేష్. మొదట్లో బీఎస్పీ పార్టీ చుట్టూ తిరిగాడని… ఆ తర్వాత ఎర్రజెండా పార్టీల చుట్టూ పవన్ కళ్యాణ్ తిరిగాడని చురకలంటించారు జోగి రమేష్. 2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ చుట్టు తిరిగి ఇప్పుడు బిజెపి మరియు తెలుగుదేశం పార్టీ అంటూ కాలయాపన చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ కు తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు నారా లోకేష్ ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిచ్చికుక్క అయితే… నారా చంద్రబాబు నాయుడు చిత్త కార్తీ కుక్క అంటూ ఫైర్ అయ్యారు. అటు నారా లోకేష్ ఊర పంది అంటూ రేంజ్ లో నిప్పులు చెరిగారు జోగి రమేష్. సింహం లాంటి జగన్ మోహన్ రెడ్డి ( Cm Jagan ) గారిని ఎదుర్కొనేందుకు ఊరపందులన్నీ ఏకమవుతున్నాయని ఆగ్రహించారు.