Samantha : సమంతపై మోజుపడ్ద మెగా హీరో.. కుదిరితే ఆ పని చేస్తాడట ?

Sai Dharam Tej Likes Samantha

Samantha :  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగా హీరోలకు ఉన్న క్రేజ్ అంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు స్టార్ హీరోలుగా మారిపోయారు. అచ్చం అలాగే మెగాస్టార్ పేరు చెప్పుకొని… స్టార్ హీరోగా మారిపోయిన వారి లిస్టులో మొదటి స్థానంలో సాయిధరమ్ తేజ్ ఉంటాడు.

పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమంలోకి అడుగుపెట్టిన సుప్రీం స్టార్ హీరో సాయి ధరంతేజ్… ఇటీవల కాలంలోనే పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమాను నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. తమిళంలో బంపర్ విజయాన్ని అందుకున్న ఓ సినిమాకు బ్రో సినిమా రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా ఈనెల 28వ తేదీన అంటే మరో నాలుగు రోజుల్లోనే రిలీజ్ కానుంది. ఇలాంటి తరుణంలో… ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయి ధరంతేజ్ మరియు హీరోయిన్ కేతికా శర్మ పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతపై ఉన్న ప్రేమను బయట పెట్టాడు హీరో సాయిధరమ్ తేజ్. ఛాన్స్ వస్తే హీరోయిన్ సమంతతో సినిమా చేయాలని చాలా ఆత్రుతగా ఉన్నానని చెప్పుకొచ్చాడు హీరో సాయిధరమ్ తేజ్. తాజాగా ప్రముఖ ఛానల్ కు సాయి ధరంతేజ్ మరియు హీరోయిన్ కేతికా శర్మ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నీకు ఏ హీరోయిన్తో సినిమా చేయాలని ఉంది ? అని సాయి ధరంతేజ్ ను సదరు యాంకర్ అడిగింది.

అయితే హీరోయిన్ కేతిక శర్మ పక్కన ఉండగానే… టక్కున హీరోయిన్ సమంత ( Samantha ) తో సినిమా చేయాలని ఉంది అని సాయిధరమ్ తేజ చెప్పాడు. చిన్నప్పటినుంచి ఎంతోమంది హీరోయిన్లను నేను చూశానని.. కానీ సమంత యాక్టింగ్ చాలా బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు. నా కెరీర్ లో.. హీరోయిన్ సమంత ఒక్క సినిమా నైనా చేయాలని వెల్లడించాడు. ఇక ఈ ఆన్సర్ సాయి ధరమ్ తేజ్ చెప్పడంతో అక్కడే ఉన్న హీరోయిన్ కేతికా శర్మతో పాటు యాంకర్ కూడా షాక్ అయింది.