Apsara Rani comments viral
Apsara Rani : టాలీవుడ్ స్టార్ నటీ అప్సర రాణి… గురించి తెలియని యూత్ ఎవరు ఉండరు. నిత్యం తన హాట్ అందాలతో అందర్నీ కనువిందు చేస్తుంది నటి అప్సరా రాణి. రాంగోపాల్ వర్మ చేసిన చాలా సినిమాలలో కీలకపాత్రలో కనిపించింది అప్సర రాణి. ఈతరణంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా పాపులర్ అయిపోయింది అప్సర రాణీ.
డెహ్రాడూన్ కు చెందిన ఈ బ్యూటీ… మొదట్లో మోడల్ గా అందరికీ పరిచయమై ఆ తర్వాత 2019 సంవత్సరంలో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. 2019 సంవత్సరంలో 4 లెటర్స్ అనే సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత థ్రిల్లర్, క్రాక్, డీ కంపెనీ మరియు సిటీ మార్ సినిమాలలో కనిపించి అందరినీ కనివిందు చేసింది ఈ బ్యూటీ.

క్రాక్ మరియు సిటీ మార్ సినిమాలలో ఐటెం సాంగ్ చేసి అందరిని మెప్పించింది. ఇది ఇలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టాలీవుడ్ నటి అప్సర రాణి కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎదుర్కొన్న సమస్యలను వివరించింది ఈ బ్యూటీ. నేను ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ… కెరీర్ ప్రారంభంలో చాలామంది కమిట్మెంట్ అడిగారంటూ హాట్ కామెంట్స్ చేసింది.
అలాగే ఆ కమిట్మెంట్లకు నేను అసలు ఒప్పుకోలేదని వివరించింది. అంతేకాదు… ఆ కమిట్మెంట్లకు నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయే దాన్ని అని వెల్లడించింది. ఇక ఇటీవల కాలంలోనే ఓ తెలుగు హీరో…సినిమాలలో ఛాన్స్ ఇస్తానని నన్ను లోబరుచుకునే ప్రయత్నం చేసినట్లు వివరించింది అప్సరా రాణి (Apsara Rani ). తన కోరిక తీర్చాలని ఓ మేనేజర్ కూడా అడిగినట్లు స్పష్టం చేసింది. అయితే వాటికి నేను అసలు ఒప్పుకోలేదని.. చాన్సులు తన టాలెంట్ ద్వారా వస్తాయని స్పష్టం చేసింది అప్సర రాణి.