Tamannaah took key decision
Tamannaah : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తమన్నా భాటియాకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ముంబై కి చెందిన ఈ బ్యూటీ తెలుగు మరియు తమిళ్, ఇప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోనూ దూసుకుపోతోంది. పాలలాగా తల తల మెరిసే… హీరోయిన్ తమన్నాకు మిల్కీ బ్యూటీ అని ఓ బిరుదు ఇచ్చిన సంగతి తెలిసిందే.
తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీ అనే సినిమాతో 2006 సంవత్సరంలో అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోయిన్గా మారిపోయింది హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఆ తర్వాత 2007 సంవత్సరంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో తెలుగుపేక్షకులకు బాగా దగ్గరయింది కిరణ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.

ఇక 2009 సంవత్సరంలో కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం, సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాతో అందరినీ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం బాలీవుడ్ చిత్రపరచడంలో ఫుల్ బిజీగా ఉన్న తమన్నా భాటియా… బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం కొనసాగిస్తోంది.
దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే వైరల్ కాగా… వారిద్దరి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా తెలుస్తోంది. అయితే తాజాగా తమన్నా భాటియా ( Tamannaah ) ప్రేమ విషయంపై బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. విజయ్ వర్మ కు తమన్నా బ్రేకప్ చెప్పిందని… అతను అంటే ఆమెకు బోర్ కొట్టడంతో… అతనికి బ్రేకప్ చెప్పిందని పోస్ట్ పెట్టాడు ఉమైర్ సందు. అయితే ఈ బాలీవుడ్ క్రిటిక్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి దీనిపై తమన్న ఎలా స్పందిస్తుందో చూడాలి.